07-02-2025 01:04:32 AM
ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఛావా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది సౌత్ సోయగం రష్మిక మందన్న. ఫిబ్రవరి 14న విడుదల కానున్న ఈ సినిమాలో శంభాజీగా విక్కీ కౌశల్ నటిస్తుండగా, ఆయన భార్య ఏసుబాయి పాత్రను రష్మిక పోషించింది.
సల్మాన్‌ఖాన్ సరసన ‘సికందర్’లోనూ నటిస్తోంది. ఇంకా రష్మిక ఖాతాలో ‘థామ’, ‘కుబేర’, ‘ది గర్ల్‌ఫ్రెండ్’, ‘రెయిన్‌బో’ చిత్రాలున్నాయి. అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. ఎప్పటిలా తన సినిమా విశేషాల గురించి కాకుండా రొటీన్‌కు భిన్నంగా ఉండటమే ఈ పోస్ట్ వైరల్ కావటానికి కారణమని తెలుస్తోంది.
‘ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతోంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా అలాగే ఉండండి. ఒకరిపై ఒకరు దయతో ఉండండి’ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో ఉన్న ఫొటోలో రష్మిక ధరించిన టీషర్ట్‌పై కూడా ‘కైండ్ ఫుల్’ (దయ) అని రాసి ఉంది. దీంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.