calender_icon.png 26 April, 2025 | 1:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పెషల్ వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేశాను

24-04-2025 12:00:00 AM

తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఓదెల 2’. సంపత్ నంది సూపర్ విజన్‌లో అశోక్‌తేజ దర్శకత్వం లో డీ మధు నిర్మించారు. ఏప్రిల్ 17న విడుదలైన ఈ సిని మా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన వశిష్ట సింహ బుధవారం విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన చెప్పిన సినిమా విశేషాలు ఆయన మాటల్లోనే.. “నేను మొదట సింగర్‌గా కెరీర్ ప్రారంభించా ను. కన్నడలో 25కుపైగా చిత్రాలకు పాడాను. తెలుగులోనూ గాయకుడిగానే ఎంట్రీ ఇచ్చాను. ‘ఓదెల’ వల్ల కొన్నేళ్లుగా పాడలేకపోతున్నా. వర్క్ ఔట్స్ మానేశాను. సినిమా పూర్తయిన తర్వాత మళ్లీ రెగ్యులర్ రొటీన్‌లోకి వచ్చాను. కాస్త టాన్ అయ్యాను. ఈ సినిమా కోసం బరువు పెరిగాను.

ప్రోస్తటిక్ మేకప్ వేసుకున్నాను. ఈవిల్ క్యారెక్టర్ కోసం స్పెషల్ వాయిస్ మాడ్యులేషన్ ప్రాక్టీస్ చేశాను. నా వాయిస్ క్యారెక్టర్‌కు ప్లస్ అయ్యింది. సంపత్ నంది ‘ఓదెల2’ కథ చెప్పిన తర్వాత చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. షాక్ అయ్యాను. కథ చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి క్యారెక్టర్ ఎప్పు డూ చేయలేదు. ఇలాంటి కథ ఎక్కడా వినలేదు. తప్పకుండా అద్భుతంగా చేయాలన్న కోరిక కలిగింది.

ఈ సినిమాలో నేను చేసిన తిరుపతి క్యారెక్టర్ సీన్‌లో ఉన్నా, లేకపోయినా తన పేరు సినిమా అంతా ఉంటుంది. ఇందులో కథానాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది తిరుపతి క్యారెక్టర్ అనే చెప్పాలి. ప్రేక్షకులు తిరుపతి క్యారెక్టర్‌కు కనెక్ట్ అయ్యారు. తమన్నా అందరితో కలివిడిగా ఉంటారు. ఇదే మొదటి సినిమా అన్నట్టుగా క్యూరియాసిటీతో వర్క్ చేస్తారు. తన ప్రజెన్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది.

అశోక్‌తేజ మంచి స్నేహితుడు. పని రాక్షసుడు. చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. సినిమాలో నా క్యారెక్టర్‌కు వచ్చిన స్పందన చాలా ఆనందాన్నిచ్చింది. నా క్యారెక్టర్ చూసిన తర్వాత ఇండస్ట్రీ నుంచి చాలా మంది నాకు కాల్ చేశారు. చాలా మంచి ఆఫర్లు వచ్చాయి.

పెద్ద పెద్ద బ్యానర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి. జనం మనల్ని గుర్తు పట్టే క్యారెక్టర్స్ చేయడంపైనే నా దృష్టి ఉంది. పాజిటివ్, నెగెటివ్.. ఏదైనా మంచి యాక్టర్ అనే గుర్తింపు తెచ్చే పాత్రలు చేయాలనుంది. ప్రతి పాత్రకూ వేరియేషన్ ఉండేలా చూసుకుంటా” అని చెప్పారు.