calender_icon.png 24 February, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిల్‌రూబాలో ఇంటెన్స్ క్యారెక్టర్ చేశా

19-02-2025 12:00:00 AM

హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘దిల్‌రూబా’. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని శివమ్ సెల్యు లాయిడ్స్,  మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమవుతోంది.

మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ‘హే జింగిలి..’ని విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. “ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా ‘దిల్‌రూబా’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నా సినిమాలన్నింటిలోకెల్లా ఈ చిత్రంలో ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాను. నా క్యారెక్టర్ లాగే యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటెన్స్‌గా ఉంటాయి.

టీజర్, ట్రైలర్‌లలో ఏది చూపించామో అదే సినిమాలో ఉంటుంది. ఎక్కడా అనవసరపు కంటెంట్ పెట్టలేదు” అన్నారు. హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ మాట్లాడుతూ.. “దిల్‌రూబా’ ప్యూర్ లవ్ ఎమోషన్, ఫీలింగ్‌తో ఉంటుంది. నా క్యారెక్టర్ ద్వారా ఫుల్ లవ్ అండ్ ఎమోషన్ చూపించాను. నాకు, కిరణ్ కు మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి” అని తెలిపింది.

డైరెక్టర్ విశ్వ కరుణ్ మాట్లాడుతూ..- “ఫస్ట్ టైమ్ లవ్‌లో పడిన అబ్బాయి కింగ్‌లా ఫీలవుతాడు. ఆ లవ్ ఫెయిలై సెకండ్ టైమ్ లవ్‌లో పడినప్పుడు అతనిలో ఒక భయం మొదలవుతుంది. ఇలాంటి ఒక ఎక్స్‌ప్రెషన్‌తో ఈ పాట నడుస్తుంది” అన్నారు.

ప్రొడ్యూసర్ రవి మాట్లాడుతూ.. “మాది పాన్ ఇండియా రిలీజ్ మూవీ కాకపోయినా పాన్ ఇండియా ప్రొడక్షన్‌తో కలిసి సినిమా చేశాం. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాం” అన్నారు.