calender_icon.png 19 April, 2025 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విరామం ఉంటేనే ఒత్తిడికి లోనవుతా..

09-04-2025 12:00:00 AM

జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఉన్నా ముందుకు సాగాలని అందాల కథానాయకి రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు తాను ఎన్నో కష్టాలు పడినట్టు చెప్పుకొచ్చారు. కన్నడ చిత్రం ‘గిల్లీ’తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్.. ఇటు దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ అవకాశాలను అందుకుంటున్నారు. ఈ బ్యూటీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన 16 ఏళ్ల కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

“సినీ పరిశ్రమలో గెలుపోటములు సహజం. వ్యక్తిగత జీవితంలోనూ అవి భాగమే. మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే. ఎన్ని కష్టాలు వచ్చినా తిరిగి రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లాలి. కెరీర్‌లో స్థిరపడే కొద్దీ మార్పులు వస్తాయి. నేను ఎంత బిజీగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటాను. వరుస షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు నాకు ఒత్తిడిగా అనిపించదు. కానీ, షూటింగ్స్ లేనప్పుడు..

విరామ సమయాల్లో చాలా ఒత్తిడికి గురవుతుంటాను. ప్రతిరోజూ పనికి వెళ్లడం, కెమెరాను ఎదుర్కోవడం నా జీవితంలో భాగమయ్యాయి. ఈ దినచర్య వల్లే నేను ఈఉన్నత స్థానానికి చేరుకున్నా. ఇదే జీవన శైలి కొనసాగించాలని కోరుకుంటున్నా” అన్నారు. ఇక రకుల్ ప్రీత్ సినిమాల విషయాకొస్తే.. ఇటీవలే హిందీలో తన భర్త జాకీ భగ్నానీ నిర్మించిన ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ చిత్రంతో ప్రేక్షకులను పలుకరించారామె.

ప్రస్తుతం అజయ్ దేవగణ్, మాధవన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తున్నారు. అలాగే నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘రామాయణ’లోనూ శూర్పణఖ పాత్రను రకుల్ ప్రీతే పోషిస్తున్నట్టు చిత్ర పరిశ్రమల్లో ప్రచారం జరుగుతోంది.