ఎక్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): పర్యావరణ కోణాల్లో, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందాల్సిన హైదరాబాద్‌కు మూసీ ఒక వరం గా కావాలి కానీ, శాపంగా మిగిలిపోకూడదని అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నా రు. గురువారం ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ.. నదుల వెంట నాగరికత వర్థిల్లాలి.. వాటిని కబలిస్తే మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని అన్నారు.
మూసీ ప్రక్షాళన చేయాలన్న ప్రభుత్వ సంకల్పం ఈ తరానికే కాదు.. తరతరాలకు మేలుచేసే నిర్ణయమని స్పష్టంచేశారు. ఈ నిర్ణయానికి అండగా నిలిచే ప్రతి వ్యక్తికీ, ప్రతి వ్యవస్థకూ ధన్యవాదాలని సీఎం పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేర కు ‘లేక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పేరొందిన కర్ణాటకకు చెందిన ఆనంద్ హైదరాబాద్‌లో మూడు రోజులుగా పర్యటిస్తున్నారు.