- శ్రీతేజ్ కోలుకుంటున్నాడు
- రేవతి భర్త భాస్కర్‌కు సినిమా ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం ఇస్తాం
- ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు వెల్లడి
సినిమా ప్రతినిధి, డిసెంబర్ 24 (విజయక్రాంతి): ఇటీవల ఎఫ్‌డీసీకి చైర్మన్‌గా తను బాధ్యతలు తీసుకున్న సమయంలో.. ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారని తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు తెలిపారు.
‘ఇన్ని రోజులు హైదరాబాద్‌లో లేకపోవడంతో హాస్పిటల్‌కు రాలేకపోయాను. నగరానికి రాగానే మంగళవారం సీఎంను కలిశాను’ అని అయన పేర్కొన్నారు. ‘పుష్ప -2’ సినిమా బెనిఫిట్ షో సం దర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ప్రస్తు తం సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌డీసీ) చైర్మన్, నిర్మాత దిల్ రాజు మంగళవా రం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లి బాలుడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. రేవతి కుటుంబా న్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే రేవతి భర్త భాస్కర్‌కు ఇండస్ట్రీలో పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామ ని హామీ ఇచ్చారు.
‘సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన దురదృష్టకరం. రేవతి భర్త భాస్కర్‌కు ఇండస్ట్రీలో ఉద్యోగం ఇచ్చే ఆలోచన గురించి సీఎంకు చెప్పాను. దీనిపై స్పందించిన రేవంత్‌రెడ్డి చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. ప్రభుత్వం వైపు నుంచి ఇండస్ట్రీకి అన్ని విధాలా సహకారం ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు’ అని దిల్ రాజు తెలిపారు.
‘శ్రీతేజ్ ఆరోగ్యం బాగానే ఉంది. త్వరగా రీకవరీ అవుతున్నాడు. అల్లు అర్జున్‌ను కూడా త్వరలోనే కలుస్తాను. అన్ని విషయాలూ తెలుసుకుంటాను. సినిమాకు సంబంధించి అందరం త్వరలో సీఎంని కలుస్తాం. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం దూరం పెడుతోందనేది దుష్ర్పచారం.
ఇండస్ట్రీకి అన్ని రకాలుగా అండగా ఉంటామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ ఇచ్చారు.. సీఎం భరో సా ఇవ్వమన్నారు.. అందుకే ఇక్కడి వచ్చి భాస్కర్‌కు భరోసా ఇస్తున్నాం. రేవతి చనిపోవడం బాధాకరం. భాస్కర్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం’ అని దిల్ రాజు తెలిపారు.