01-04-2025 02:27:52 AM
నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్‌నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యాడ్‌స్క్వేర్’. కళ్యాణ్‌శంకర్ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు కళ్యాణ్‌శంకర్ మీడియాతో ముచ్చటి స్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. “మ్యాడ్’కి రెట్టింపు వినోదం ‘మ్యాడ్ స్క్వేర్’తో అందిస్తామని మేం చెప్పిన మాట నిలబెట్టుకున్నాం.
‘మ్యాడ్-1’ ఫుల్ రన్ కలెక్షన్స్‌ను మొదటి రోజే రాబట్టే స్థాయిలో ‘మ్యాడ్‌స్క్వేర్’పై అంచనాలు ఉన్నాయని అసలు ఊహించలేదు. పెద్ద కథ ఆశించి సినిమాకు రావొద్దు.. సరదాగా నవ్వుకోవడానికి రండి అని ముందే చెప్పడం మాకు ప్లస్ అయింది. రాజమౌళి కూడా సినిమా మొదలుపెట్టే ముందే కథ ఇలా ఉండబోతుందని చెప్తుంటారు. అలా చెప్పడం వల్ల ప్రేక్షకులను మనం ముందే ప్రిపేర్ చేసినట్టు అవుతుంది. రవితేజతో చేస్తున్న సూపర్ హీరో సినిమాలో కచ్చితంగా కామెడీ ఉంటుంది.
సూపర్ హీరోకు ఒక మంచి బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఇది పూర్తిగా ఫిక్షన్. కామెడీ అయినా ఎమోషన్ అయినా ఊహించనివిధంగా రావాలి. అలా తీసుకురావడమే నా బలం అని నేను నమ్ముతా. జనాల్లో ఈ మధ్య బాగా సీరియస్ నెస్ పెరిగిపో తుంది. చిన్న విషయాలకూ ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. అందుకే జనాలను నవ్వించాలనే ఉద్దేశంతో కామెడీ సినిమాలు చేస్తున్నా. కామెడీ జానర్లకు డిమాండూ ఎక్కువే” అన్నారు.