రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదు n మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్
ముంబై, ఆగస్టు 13: రాజకీయాలను ఇంటి వరకు రానివ్వకూడదని మహా రాష్ట్ర డిప్యూటీ సీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బారా మతి స్థానం నుంచి సోదరి సుప్రియ సూలేపై తన భార్య సునేత్ర పవార్‌ను పోటీలో నిలపడం తప్పేనని వ్యాఖ్యా నించారు. త్వరలో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో రాష్ట్రవ్యాప్తంగా ‘జన సమ్మాన్ యాత్ర’ నిర్వహిస్తున్న ఆయన మంగళవారం ఓ న్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
‘నా సోదరీమణులంటే నాకు ఎంతో ఇష్టం. సుప్రియపై సునేత్రను పోటీకి నిలిపి తప్పు చేశాను. ఎన్సీపీ పార్ల మెంటరీ పార్టీ బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు పోటీకి దింపాల్సి వచ్చింది’ అని అజిత్ పవార్ వ్యాఖ్యా నించారు. అయితే, రక్షాబంధన్ వస్తు న్నందున సుప్రియను కలుస్తారా అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించగా అవకాశం ఉంటే తప్పకుండా కలుస్తానని తెలిపారు. కాగా, గతేడాది ఎన్సీపీలో చీలిక వచ్చిన విషయం తెలిసిందే.