calender_icon.png 29 November, 2024 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తప్పులు చాలానే చేసిందట..

29-11-2024 12:05:50 AM

బాలీవుడ్ ముద్దుగుమ్మ ఈషా గుప్తా గురువారం పుట్టినరోజు జరుపుకున్నారు. అమ్మడు ప్రస్తుతం 39వ ఏట అడుగు పెట్టారు. తన 38 ఏళ్ల జీవితాన్ని ఎత్తుపల్లాల సమ్మిళితమని తెలిపారు. తను చాలా తప్పులు చేశానని.. అయితే వాటి నుంచి పాఠాలు నేర్చుకున్నానని తెలిపారు. “నేను 38 ఏళ్ల జీవితాన్ని చూశాను. అదంతా రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఉంది. నేను చాలా తప్పులు చేశాను. వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ పెరిగాను. జీవితమంటే అంతే. అలాగే ఉండదు. మార్పు చెందుతూ ఉంటుంది.

నన్ను ఎవరైనా ఇప్పుడు చూస్తే.. నేను చాలా మంచిగా మారానని అనుకుంటారు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు జీవితం గురించి నీకొక విభిన్నమైన ఆలోచన ఉంటుంది. నాకొక అందమైన కుటుంబం, నా కుటుంబంలా మారిన స్నేహితులను ఇచ్చిన దేవుడికి నేనెప్పుడూ రుణపడి ఉంటా. నీ జీవితంలోకి ఒక పర్పస్‌తో వచ్చేవారు తప్పనిసరిగా నీకొక గుణపాఠం నేర్పే పోతారు. అయితే అది మీరు తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది కానీ అది చాలా విలువైనది”అని ఈషా చెప్పుకొచ్చారు. తనకు తన 5వ పుట్టినరోజంటే అత్యంత ఇష్టమట. తన సోదరి పుట్టిన రోజు నవంబర్ 26 కావడంతో.. సోదరితో కలిసి కేక్ కట్ చేసిన రోజు.. అలాగే ఇద్దరు వేర్వేరు రంగులున్న డ్రెస్‌లతో మ్యాచింగ్ కేక్స్ కట్ చేసిన రోజు అదేనని ఈషా తెలిపారు.