* బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ వ్యాఖ్య
లండన్, డిసెంబర్ 22: ‘నేను ఇంకా బతి కే ఉన్నా’ అని బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ తెలిపారు. ఈ ఏడాది చివరి కార్యక్రమంగా ఈస్ట్ లండన్‌లోని వాల్తామ్ ఫారెస్ట్ హాల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కింగ్ చార్లెస్, క్వీన్ కెమిల్లా దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేశంలోని యువకులు, ఎమర్జెన్సీ సిబ్బంది, వలంటీర్లు, వివిధ వర్గాల ప్రముఖులతో కింగ్ మాట్లాడారు. ఈ క్ర మంలో భారత సంతతికి చెందిన హర్విందర్ రతన్ మాట్లాడుతూ.. రాజుగారు మీరు ఎలా ఉన్నారని అడిగారు. దీంంతో కింగ్ చార్లెస్ బదిలిస్తూ తాను ఇంకా బతికే ఉన్నానని సరదాగా చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులకు బొమ్మలను బహుమతిగా ఇవ్వడంతో పాటు స్థానిక ఫుడ్ బ్యాంక్‌కు ఆహారాన్ని క్వీన్ కెమిల్లా అందించారు. కాగా కింగ్ చార్లెస్ కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతున్నారు.