* మణిపూర్ సీఎం బీరేన్‌సింగ్
ఇంఫాల్, డిసెంబర్ 31: ‘మణిపూర్‌లో కల్లోల పరిస్థితులు నెలకొ న్నాయి. 2024 ఉద్రిక్తల మధ్యే సాగింది. రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యా రు. ఎంతోమంది వారి కుటుంబ సభ్యులను కోల్పోయారు. అవన్నీ నన్ను కలచివేస్తున్నాయి.
దయచేసి నన్ను క్షమించండి’ అని సీఎం బీరేన్‌సింగ్ మంగళవారం మీడియా ముఖంగా కోరారు. ఒక్క ఏడాదిలో 12 వేలకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, అనేక కేసుల్లో 625 మంది అరెస్టయ్యారన్నారు. పోలీసులు నిందితుల నుంచి 5,600 మరణాయుధాలు, 35 వేలకు పైగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను గమనించి కేంద్రం ప్రత్యేక బలగాలను సైతం పంపించిందని గుర్తుచేశారు. నిర్వాసితులను ఆదుకునేందుకు నిధులు సమకూర్చిందన్నారు. త్వరలో నిర్వాసితులకు ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. 2025లోనైనా రాష్ట్రంలో శాంతిస్థాపన చేస్తానని హామీ ఇస్తున్నానని ప్రకటించారు.