calender_icon.png 25 October, 2024 | 1:47 AM

ప్రేమించానే పిల్లా..

07-07-2024 12:05:00 AM

వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల హీరోహీరోయిన్లుగా రైటర్ మోహన్ దర్శక త్వంలో తెరకెక్కుతున్న కామెడీ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. శ్రీగణపతి సినిమాస్ పతాకంపై లాస్యరెడ్డి సమర్పణలో వెన్నపూస రమణరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సియాగౌతమ్, స్నేహగుప్తా, రవితేజ మహాదాస్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్‌గౌడ్, భద్రం, అనీష్ కురివెళ్ల, నాగ మహేశ్, మచ్చ రవి, ప్రభావతి, సంగీత, శుభోదయం సుబ్బారావు, శివమ్ మల్హోత్రా, వాజ్‌పేయ్  ఎంవీఎన్ కశ్యప్ తదితరులు ముఖ్య తారాగణంగా భాగస్వాములవుతున్నారు.

ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీత సారథ్యం వహిస్తుండగా, ఆయన మెలోడీగా కంపోజ్ చేసిన ‘ప్రేమించానే పిల్లా’ అనే పాటను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. పూర్ణాచారి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్ గీత రచయితలుగా పనిచేసిన ఈ సినిమాకి, డీవోపీ సహకారం: మల్లికార్జున్; ఎడిటర్: అవినాష్ గుర్లింక; ఆర్ట్ డైరెక్టర్: సురేశ్ బిమగాని; స్టంట్స్: డ్రాగన్ ప్రకాశ్.