23-04-2025 01:17:54 AM
తెలుగు సినీ పరిశ్రమలో పాటిస్తున్న సమయపాలన గురించి, ఇక్కడ నటీనటులకు దక్కుతున్న ఆదరణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది హీరోయిన్ ఆరతి గుప్తా. తెలుగు సినిమా గురించి నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని కూడా చెప్పిందీ ముంబై ముద్దుగుమ్మ. తాజాగా ఈ బ్యూటీ మీడియాతో మాట్లాడుతూ.. తన గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.
‘నేను పుట్టి పెరిగిందంతా చంఢీగడ్‌లోనే. కానీ ఇప్పుడు ముంబైలో స్థిరపడ్డాను. బాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించాను. నాకు అన్ని తరహా పాత్ర లు, సినిమాలు చేయాలనుంది. బాగా యాక్ట్ చేయగలిగితే మనం అందంగా కనిపిస్తాం. ఒకవేళ అందంగా ఉండి యాక్ట్ చేయలేకపోయినా గ్లామర్‌గా కనిపించలేం. అయితే, నా తొలి ప్రాధాన్యత మాత్రం పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమాలకే. నేను ఇంత కుముందు సంప్రదాయ బద్ధమైన పాత్రల్ని చేశాను.
నిజ జీవితంలో కూడా నేను సింపుల్ గర్ల్. నా వ్యక్తిత్వం అలానే ఉంటుంది. నా వ్యక్తిత్వానికి దగ్గరగా ఉండే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నందుకు సంతోషంగా ఉంది. తెలుగులో తొలిసారి కథానాయికగా నటిం చే అవకాశం రావడం పట్ల ఆనందంగా ఉన్నాను. అమాయకమైన పల్లెటూరి అమ్మాయిగా ఆ సినిమాలో కనిపించబోతున్నాను.
నేను నటిస్తున్న సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా నిర్మాత చెప్పిన మాటలను ప్రేరణగా తీసుకొని తెలుగు నేర్చుకుంటున్నాను. తెలుగు ఎంతో బ్యూటీఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ స్థిరపడా లంటే తెలుగు నేర్చుకోవాలి. అప్పు డే నాకు సౌకర్యవంతంగా ఉంటుం ది. హైదరాబాద్‌లో ఏదో తెలియని ఎనర్జీ ఉంది. కామ్‌గా ఉంది. వెరీ మచ్ హోప్‌ఫుల్. ఇక్కడ నేను బిజీ అవుతా నేమో అనిపిస్తోంది. హీరో సంపూర్ణేష్‌బాబు గురించి విన్నాను.
అవుట్ ఆఫ్ ది బాక్స్ యాక్టర్ అని తెలుసు. సంపూర్ణేష్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ తెలుసు. ఆయన గత చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’ చూశాను. నన్ను ఇన్‌స్పైర్ హీరోయిన్ల గురించి చెప్పాలంటే.. అలియాభట్ అంటే నాకు ఇష్టం. ఆమె జర్నీ, ఆమె చేసిన పాత్రలు నాలో ప్రేరణ నిం పాయి.
ఆమె సినిమాల ఎంపిక కూడా బాగుంటుంది. టాలీవుడ్‌లో అల్లు అర్జున్ అన్నా, ఆయన సినిమాలన్నా చాలా ఇష్టం. తెలుగు సిని మాలో సమయ పాలన చాలా ఇష్టం. ఇక్కడ ఆర్టిస్టుల ప్రొఫెషనలిజం కూడా నచ్చుతుంది. ప్రతి ఆర్టిస్టునూ సమానంగా చూడటాన్ని నేను గ్రహించాను. అయితే, తెలుగు సినిమా గురించి నేను తెలుసుకోవాల్సింది చాలానే ఉందనిపి స్తోంది’ అని తెలిపింది.