- నేను రివేంజ్ పాలిటిక్స్ చేయను
- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): సంగారెడ్డిలో తాను ఓడిపోవడానికి హరీశ్‌రావు కారణమని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేటలో గెలవడానికి హరీశ్ ఎంత కష్టపడ్డాడో, తనను ఓడించడానికీ అంతే కష్టపడ్డారని వెల్లడించారు. ఎన్నికల సమయంలో తన ప్రణాళికలను ఆయన భగ్నం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు మూడు, నాలుగు రోజుల ముందు మీటింగ్ పెట్టి మెసేజ్ ఇచ్చే అలవాటు తనకు ఉందని, కానీ ఆ మీటింగ్‌ను హరీశ్‌రావు అడ్డుకున్నారని గుర్తుచేశారు.
సంగారెడ్డిలో పార్టీని గెలిపించి తన మామకు గిఫ్ట్‌గా ఇవ్వాలని హరీశ్‌రావు కసిగా పనిచేశారని చెప్పా రు. సోమవారం హైదరాబాద్‌లో మీ డియాతో జగ్గారెడ్డి చిట్‌చాట్ నిర్వహించారు. రివేంజ్ పాలిటిక్స్‌కు తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. రివేంజ్ పాలిటిక్స్ ఎవరు చేసినా మంచిది కాదని హితవుపలికారు.
కక్ష సాధింపు అనే గుణం తెలంగాణ ప్రజల రక్తంలో ఉండదని చెప్పా రు. రివేంజ్ పాలిటిక్స్ కాంగ్రెస్ నాయకులు సహా ఎవరికీ మంచివి కావన్నారు. తాను రాజకీయ యుద్ధం చేస్తాను కానీ, కక్ష సాధి ంపు చర్యలకు దిగనన్నారు. గతంలో చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా రివేంజ్ రాజకీయాలు చేయలేదన్నారు.