calender_icon.png 19 April, 2025 | 3:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్యకర్తలను కంటికి రెప్పలా చూసుకుంటా

08-04-2025 12:49:38 AM

బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం

తలకొండపల్లి, ఏప్రిల్ 7: అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబానికి భరోసా నిస్తు అదైర్యపడొద్దు అండగా ఉంటానని.... కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని  కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు. కడ్తాల్ మండలం కర్కల్ పహడ్ గ్రామానికి చెందిన కాంగ్రేస్ పార్టీ కార్యకర్త సిలివేరు శ్రీను గత నెల లో అనారోగ్యానీకి గురై మృతిచెందారు.

మృతుని కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంభాన్ని పోషించే వ్యక్తి ఆకాల మృతితో ఆకుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి మృతుని భార్య, పిల్లలు కుటుంబ సభ్యులను సోమవారం హైదరాబాద్‌లోని తన నివాసానికి పిలిపించుకొని ధైర్యం చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన శ్రీను చిన్న వయస్సులో ఆకాల మృతి చెందడం భాదాకరమన్నారు.

పిల్లలకు మంచి భవిష్యత్ అందించేందుకు, వారి పైచదువులకు తమ వంతు సహా య సహాకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆపద్భందు కింద శ్రీను భార్య, పిల్లలకు రూ.2 లక్షల చెక్కును అర్థిక సహాయంగా ఎమ్మెల్యే శ్రీను కుటుంబ సభ్యులకు అందజేశారు.