* ఆనంద్ మహీంద్రా
న్యూఢిల్లీ, జనవరి 12: ‘మనం ఎన్ని గంటలు పనిచేశామనేది ము ఖ్యం కాదు. ఎంత నాణ్యతతో.. ఎంత సమర్థంగా పనిచేశామనేది ముఖ్యం’ అని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డా రు. ఉద్యోగులు ఊరికే భార్యను చూ స్తూ కూర్చోకుండా, వారానికి 90 గంటలు పనిచేయాలంటూ ఇటీవల ఎల్‌అండ్‌టీ చైర్మన్ సుబ్రహ్మణియన్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం నడి చింది.
ఎంతోమంది సెలబ్రెటీలు ఆయన వ్యాఖ్యలను తప్పుబ డుతూ పోస్టులు పెడుతున్నారు. తా జాగా ఆయన వ్యాఖ్యలపై ఆనంద్ మహీంద్రా సైతం స్పందించారు. ‘నా భార్య అద్భుతమైన మహిళ. ఆమెను చూస్తూ ఉండిపోవడం నా కెంతో ఇష్టం’ అని ఓ మీడియా సంస్థకు వెల్లడించారు. ఎల్‌అండ్‌టీ చీఫ్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.