calender_icon.png 27 December, 2024 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిలేషన్‌లో ఉండటం నాకిష్టం

27-12-2024 02:46:48 AM

అందాల తార శ్రుతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రానున్న ‘కూలీ’ చిత్రంలో నటి స్తోంది. ఆమె నటిస్తున్న మరో సినిమా ‘సలార్: శర్వాంగపర్వం’ త్వరలో పట్టాలెక్కనుంది. అయితే పెళ్లి చేసుకోవ డం తనకు ఇష్టం లేదని గతంలో చెప్పింది శ్రుతి హాసన్. తాజాగా ఆ వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా వివాహ బంధం గురించి తన నిర్ణయాన్ని చెప్పడ మే కాక పెళ్లి గురించి ప్రస్తావించింది. ‘జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఊహించని మార్పులు వస్తుంటాయి. పెళ్లి చేసుకోను అని చెప్పాను కానీ.. ఎప్పటికీ చేసుకోనని చెప్పలేదు కదా! నేను రిలేషన్‌లో ఉండటాన్ని ఇష్టపడతాను.

రొమాంటిక్‌గా ఉండటం ఇష్టం. నా చుట్టూ ఉండేవారితో చనువుగా ఉంటాను. ప్రస్తుతానికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. భవిష్యత్తులో ఎవరైనా నా మనసుకు దగ్గరైతే వారిని వివాహం చేసుకుంటాను. నా స్నేహితులు, బంధువులు ఎంతోమంది వివాహానంతరం సంతోషంగా ఉన్నారు’ అని చెప్పింది. అయితే రిలేషన్, పెళ్లి గురించి శ్రుతి ప్రస్తావించడం ఇదే మొదటిసారి కాదు.

ఇటీవల ఇన్‌స్టాలో ఒక నెటిజన్ నుంచి ‘మీరు సింగిలా.. రిలేషన్‌లో ఉన్నారా?’ అనే ప్రశ్న ఎదరైందీ అమ్మడుకు.. దానికి ఇలా సమాధానమిచ్చింది.. ‘నాకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవు. కానీ, చెబుతున్నా. ఇప్పుడు నేను సింగిలే. రిలేషన్ కోసం ఎదురుచూస్తున్నా. ప్రస్తుతానికి పనిలో మునిగి పోయాను. జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా’ అని తెలిపింది.