calender_icon.png 25 February, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథ విన్నంతసేపూ నవ్వుతూనే ఉన్నా!

20-02-2025 12:00:00 AM

సందీప్ కిషన్ 30వ చిత్రం ‘మజాకా’. త్రినాథరావు నక్కిన దర్శక త్వంలో ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. అన్షు, రావు రమేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో విడుదల కానుందీ చిత్రం.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకి రీతూ బుధవారం విలేకరులతో పంచుకున్న సినిమా విశేషాలివీ.. “ప్రసన్న ఈ కథ చెప్పినపుడు చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. అదే సమయంలో కథ హై ఎమోషనల్ కోషేంట్‌గా ఉంది. రెండు ఫీమేల్ క్యారెక్టర్స్‌కి కథలో చాలా ప్రాధాన్యం ఉంది. నరేషన్ చెప్తున్నప్పుడు మొత్తం నవ్వుతూనే ఉన్నా.

సెకండ్ హాఫ్‌లో నాకు రావు రమేశ్‌కు ఓ సింగి ల్ టేక్ సీన్ ఉంది. ఆ రోజు షూట్ చేసినప్పుడు అవుట్ పుట్ విషయంలో అందరూ చాలా హ్యాపీ అయ్యారు. రావు రమేశ్ డబ్బింగ్ పూర్తయ్యాక ఫోన్ చేసి ‘చాలా అద్భుతంగా చేశావమ్మా.. నా 16 ఏళ్ల కెరీర్‌లో అలాంటి సీన్ చూడాలేదు’ అని చెప్పడం చాలా మెమరబుల్.

షూటింగ్ చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. సెట్స్‌లో అందరూ ఎనర్జిటిక్‌గా ఉండేవారు. అదే ఎనర్జీ ప్రమోషన్స్‌లో కూడా కనిపిస్తోంది. త్రినాథరావు సినిమా అంటేనే -ఫుల్ ఎంటర్‌టైనింగ్. ఇది కూడా లాట్స్ అఫ్ కామెడీ. హై ఆన్ ఎమోషన్. సాంగ్స్ చాలా గ్రాండియర్‌గా ఉంటాయి. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి.

ఇందులో నేను కాలేజ్ గర్ల్‌గా కనిపిస్తా. బాల్యంలో ఎమోషనల్ కాన్ ఫ్లిక్ట్ వల్ల తనపై ఎలాంటి ఎఫెక్ట్ పడింది? సందీప్ క్యారెక్టర్‌తో తన రిలేషన్‌షిప్..? ఇలా చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంటుంది. నా క్యారెక్టర్‌ను కొత్తగా ప్రజెంట్ చేశారు. -సందీప్ లవ్లీ కోస్టార్. ఎనర్జిటిక్‌గా ఉంటారు. చాలా సపోర్టివ్. ఆయనతో వర్క్  వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. అన్షు చాలా పాజిటివ్ పర్సన్.

చాలా హార్డ్ వర్కర్. తన కమ్‌బ్యాక్ గురించి ఎక్సయిటెడ్‌గా ఉన్నా. డైరెక్టర్ త్రినాథరావు చాలా జోవియల్ పర్సన్. చాలా ఎనర్జిటిక్‌గా ఉంటూ, అందరినీ ఎనర్జీతో ఉంచుతారు. ప్రసన్న రోజూ సెట్‌కి వచ్చేవారు.. కామిక్ టైమింగ్‌లో చాలా పర్టిక్యులర్. -రాజేశ్, అనిల్ పాషనేట్ ప్రొడ్యూసర్స్. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. వారి ప్రొడక్షన్‌లో మరో సినిమా చేయాలనుంది.

నటిగా చాలా మంచి సినిమాలు పాత్రలు చేశా. గుర్తు పెట్టుకునే పాత్రలు కొన్ని ఉండటం హ్యాపీ. భవిష్యత్తులో యాక్షన్ రోల్ చేయాలనుంది. అలాగే కామెడీ చేయడం చాలా ఇష్టం.

ఫుల్ లెంగ్త్ పీరియడ్ సినిమా చేయాలన్నది కూడా నా ఆశ. ‘పెళ్లి చూపులు2’ ప్లాన్ చేస్తే బావుంటుంది. ఇక కొత్త ప్రాజెక్ట్స్ గురించి.. -తెలుగులో ఓ మల్టీ స్టారర్‌కు సైన్ చేశా. ఇప్పటికే ఓ వెబ్‌సిరిస్ చేశా.. హాట్‌స్టార్‌లో రిలీజ్ కానుంది.