calender_icon.png 11 April, 2025 | 2:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వించడంలో ఇంత ఆనందముందని ఇప్పుడే తెలిసింది

29-03-2025 12:40:27 AM

నార్నె నితిన్, సంగీత్‌శోభన్, రామ్‌నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. కళ్యాణ్‌శంకర్ దర్శకత్వంలో హారిక సూర్యదేవర, సాయిసౌజన్య నిర్మించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మీడియాతో తమ ఆనందాన్ని పంచుకుంది. కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ.. “మ్యాడ్ స్క్వేర్’ చిత్రానికి ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన లభిస్తోంది.

ప్రేక్షకులు గోల చేసుకుంటూ సినిమా చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగింది” అని తెలిపారు. మరో హీరో రామ్‌నితిన్ మాట్లాడుతూ.. “నవ్విస్తే ఇంత ఆనందం ఉంటుందని ఇప్పుడే తెలిసింది’ అన్నారు. ‘మా దర్శకుడు, నిర్మాత ముందే చెప్పారు.. నవ్వించడానికే సినిమా తీశామని. ప్రేక్షకులు అదే అంచనాలతో థియేటర్‌కు వస్తున్నారు’ అని ఇంకో హీరో సంగీత్‌శోభన్ చెప్పారు.

‘ఇలాంటి సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉంది’ అని నటి ప్రియాంక జవాల్కర్ తెలిపారు. దర్శకుడు కళ్యాణ్‌శంకర్ మాట్లాడుతూ.. ‘థియేటర్‌లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుంటే, దీని కోసమే కదా మనం సినిమా తీసింది అనిపించింది’ అన్నారు.

చిత్ర సమర్పకుడు నాగవంశీ మాట్లాడుతూ.. ‘ప్రేక్షకులను నవ్వించడమే లక్ష్యంగా సినిమా తీశాం.. విజయం సాధించాం’ అన్నారు. ‘మా కష్టానికి తగ్గ ఫలితం దక్కడం సంతోషంగా ఉంది. కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమాకు వస్తున్నారు. నిర్మాతగా ఇలాంటి మరిన్ని మంచి సినిమాలు అందించాలని ఉంది’ అని చిత్ర నిర్మాత హారిక సూర్యదేవర చెప్పారు.