- నిబంధనల మేరకు అధికారులపై చర్యలుంటాయి
- శాసన సభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్ స్పష్టం
- ప్రొటోకాల్ వివాదంపై స్పీకర్‌కు ఎమ్మెల్యే వీరేశం ఫిర్యాదు
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : శాసన సభాపతిగా సభ్యుల గౌర వాన్ని కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు జరిగిన అవమానంపై తనకు వివరించారని, ఆయన ఆవేదనను అర్థం చేసుకున్నానని, వెంటనే పూర్తి వివరాలను తెప్పించుకుంటానని చెప్పారు. ఎమ్మెల్యేల హక్కులకు, గౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, శాసనసభా నియమాల పరిధిలో తగు చర్యలు తీసుకుంటామన్నారు.
పోలీసుల తీరు మారడం లేదు : ఎమ్మెల్యే వీరేశం
ప్రభుత్వం మారినా పోలీసుల తీరు మారడం లేదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఉన్న పోకడలనే పోలీసులు ఇంకా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 30న భువనగిరిలో మంత్రుల పర్యటనలో .. ఎమ్మెల్యే వీరేశానికి ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులు అవమానించిన విష యంపై బుధవారం స్పీకర్‌ను ఎమ్మెల్యేలు వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, బత్తుల లక్ష్మారెడ్డి కలిసి ఫిర్యాదు చేశారు. అనంత రం ఎమ్మెల్యే వీరేశం మీడియాతో మాట్లాడుతూ.. పోలీసు అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్న తమను గుర్తుపట్టనివారు.. ప్రజలకు ఎలాంటి రక్షణ కల్పిస్తారని ప్రశ్నించారు.
ప్రోటోకాల్ పాటించని అధికారులను పిలిచి మాట్లాడుతానని స్పీకర్ చెప్పారన్నారు. దళిత వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకే కాదు ఏ ప్రజాప్రతినిధికి ఇలా జరగొద్దని పేర్కొన్నారు. ప్రోటోకాల్ పాటించని డీసీసీ, ఏసీపీపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్టు పునరుద్ఘాటించారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఫ్రెండ్లీ పోలీసు అనేది ప్రజల్లో నమ్మకం కలిగేలా పని చేయా ల్సి ఉంటుందని చెప్పారు. ఇలాంటి ఘటన లు రిపీట్ కావద్దని పోలీసులకు సూచించారు.
దళిత ఎమ్మెల్యేలను అవమానిస్తున్నారు: ఎమ్మెల్యే కవ్వంపల్లి
దళిత ఎమ్మెల్యేలను పోలీసులు, ఇతర అధికారులు కావాలనే అవమానిస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. తాము మాట్లా డిన విషయాలను కొందరు అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. వేము ల వీరేశంను కావాలనే కొందరు అణగదొక్కుతున్నారని, రెండుసార్లు ఎమ్మెల్యే అయి నా వ్యక్తిని గుర్తుపట్టరా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.