07-03-2025 10:19:35 AM
హైదరాబాద్: తన భర్తతో తనకు ఎలాంటి మనస్పర్థలు లేవని గాయని కల్పన రాఘవేందర్(Singer Kalpana Raghavendar ) పేర్కొన్నారు. తాజాగా కల్పన ఓ వీడియో సందేశంలో మాట్లాడుతూ... నేను, నా భర్త, కుమారై సంతోషంగా జీవిస్తున్నామని వెల్లడించారు. వృత్తిపరంగా ఒత్తిడి ఎక్కువైంది, నిద్రపట్టట్లేదని తెలిపారు. నిద్ర కోసం చికిత్స తీసుకుంటున్నానని స్పష్టం చేశారు. ప్రిస్క్రిప్షన్ లోని మందులు ఎక్కువ మోతాదులో తీసుకున్నానని చెప్పారు.
ట్యాబ్లెట్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం ల్ల స్పృహతప్పి పడిపోయానని కల్పన పేర్కొన్నారు. త్వరలోనే మళ్లీ నా పాటలతో మిమ్మల్ని అలరిస్తానని తెలిపారు. నా ఆరోగ్యం గురించి వాకబు చేసిన అందరికీ కల్పన(Singer Kalpana) ధన్యవాదాలు చెప్పారు. తన కుమార్తెకు సంబంధించిన సమస్యల కారణంగానే తాను ఆత్మహత్యకు ప్రయత్నించానని వస్తున్న వార్తలపై ప్రముఖ గాయని కల్పన స్పందించిన విషయం తెలిసిందే. కల్పనా రాఘవేందర్ బుధవారం హైదరాబాద్‌లోని తన ఇంట్లో అపస్మారక స్థితిలో కనిపించడం అభిమానుల్లో ఆందోళనను రేకెత్తించింది. అయితే, తాను ఆత్మహత్యకు ప్రయత్నించలేదని, ప్రమాదవశాత్తూ నిద్రమాత్రలు అధిక మోతాదులో తీసుకున్నానని స్పష్టం చేసింది.