* సినీ నటుడు మంచు మనోజ్
* చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
చంద్రగిరి, జనవరి 16: తనకు ఎవరితోనూ గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని సినీ నటుడు మంచు మనోజ్ స్పష్టం చేశారు. ఈనెల 15న మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద జరిగిన పరిణామాలపై చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో గురువారం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. తనతో పాటు తన భార్య మౌనికపైనా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని అందులో పేర్కొన్నారు.
తన ఇంటిలోకి తనను ఎందుకు అనుమతించడం లేదని పోలీస్ అధికారులను ప్రశ్నించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, తిరుపతి వదిలి వెళ్లాలని మనోజ్‌కు ఈ సందర్భంగా పోలీసులు సూచించారు. గత కొన్ని రోజులుగా మంచు కుటుంబంలో విభేదాలు తారస్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగను పురస్క రించుకుని మంచు మనోజ్ దంపతులు బుధవారం సాయంత్రం మోహన్‌బాబు యూనివర్సిటీకి చేరుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసు లు అడ్డకున్నారు. తమ తాత, నాయనమ్మ సమాధులను చూసేందుకు ఎవ రి అనుమతి తీసుకోవాలంటూ మనోజ్ పోలీసులను ప్రశ్నించారు.
కోర్టు ఆదేశాల మేరకు యూనివర్సిటీలోకి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు స్ప ష్టం చేశారు. అనంతరం మనోజ్ దంపతులు బందోబస్తు మధ్య తాత, నాయన మ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. ఈక్రమంలో మనోజ్, విష్ణు బౌన్సర్ల మధ్య తోపులాట జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా, మీడియాతో మా ట్లాడుతుండగా మనోజ్‌కు కడుపునొప్పి రావడంతో ఇబ్బందికి గురయ్యారు.