- క్యాంపు కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నా
మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి
పటాన్‌చెరు, జనవరి 23: ‘ప్రజలు రెండు సార్లు ఛీకొట్టినప్పటికీ కాట శ్రీనివాస్‌గౌడ్‌కు బుద్ధి రాలేదు. క్యాంపు కార్యాలయంపై కాట శ్రీనివాస్‌గౌడ్ మనుషులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మరోసారి ఇలాంటి ఘటనలకు పాల్పడితే సహించేది లేదు’ అని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సీరియస్ అయ్యారు. గురువారం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజల ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా నని తెలి పారు. కాట శ్రీనివాస్‌గౌడ్‌కు అమీన్ పూర్ ప్రజలు సర్పంచ్‌గా అవకాశం ఇస్తే నిధు లు పక్కదారి పట్టించిన కేసులో ఇప్పటికీ జైలు చుట్టూ తిరుగుతున్నాడని అన్నారు. తన ౩౦ ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాం టి నీఛ రాజకీయాలు చూడలేదన్నారు. మరోసారి ఇలాంటివి జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దాడి ఘటనపై ఐజీ సత్యనారాయణ, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.