calender_icon.png 27 December, 2024 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాది బలమైన క్యారెక్టర్

21-12-2024 12:00:00 AM

ధర్మ , ఐశ్వర్య శర్మ జంటగా నటిస్తున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 27న విడుదల కానుంది. ఈ క్రమంలోనే హీరోయిన్ ఐశ్వర్య శుక్రవారం మీడియాతో తన వ్యక్తిగత విషయాలు, సినిమా విశేషాలను పంచుకున్నారు. 

“డ్రింకర్ సాయి’లో నా క్యారెక్టర్ పేరు బాగీ. ఈ కథ విన్న ప్పుడు నాది చాలా బలమైన క్యారెక్టర్ అనిపించింది. మా నాన్న స్టేజ్ యాక్టర్. నాపై ఆ ప్రభావం తెలియకుండానే పడింది. చిన్నప్పటి నుంచి ఆర్టిస్టుగానే ఉండాలనుకున్నాను. డ్యాన్సర్, సింగర్ కావాలనేది నా కోరిక. 12 క్లాస్ పూర్తయిన తర్వాత జమ్మూ నుంచి ముంబై వచ్చి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయ్యాను. యాక్టింగ్ కోర్సు పూర్తయ్యాక ఆడిషన్స్ ఇవ్వడం ప్రారంభించాను.

తెలుగమ్మాయిని కాకపోవడం వల్ల డైలాగ్స్ చెప్పేప్పుడు కాస్త ఇబ్బందిగా ఉండేది. ఈ సినిమా చేసేప్పుడు భాష ఒక్కటే నేను ఎదుర్కొన్న సమస్య. ‘డ్రింకర్ సాయి’లో ఒక మంచి ప్రేమకథను చూస్తారు. మా డైరెక్టర్ కిరణ్ ఫన్నీ పర్సన్. మా మీద ఎలాంటి ప్రెజర్ పెట్టలేదు. షూటింగ్ అంతా సరదాగా చేశాం. నా ఫేవరెట్ యాక్టర్ ధనుష్‌” అంటూ ఐశ్వర్య చెప్పుకొచ్చింది.