- శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి హల్‌చల్
- తనిఖీలు నిర్వహించి ఫేక్ బెదిరింపుగా నిర్ధారించిన పోలీసులు
రాజేంద్రనగర్, నవంబర్ 16: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడు తన వద్ద బాంబు ఉందంటూ హల్‌చల్ చేశాడు. పోలీసులు అతడిని తనిఖీ చేసి ఫేక్‌బెదిరింపుగా తేల్చారు. వివారలు.. బ్యాం కాక్ వెళ్లాల్సిన ఓ విమానం శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంటుండగా అప్పటికే విమానంలో ఉన్న ఓ ప్రయాణి కుడు తన వద్ద బాంబు ఉందని గట్టిగా కేకలు వేశాడు.
దీంతో విమానంలోని ప్రయాణికులు తీవ్ర భయాందోళన చెందారు. వెంటనే పైలెట్ పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో సదరు ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని క్షుణ్ణం గా తనిఖీ చేశారు. అదేవిధంగా పోలీసులు జాగిలాలతో విమానంలో తనిఖీలు చేసి ఎలాంటి బాంబు లేదని తేల్చారు.
బాంబు ఉందని చెప్పిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇటీవల కొంతకాలంగా కొందరు ఆకతా యిలు విమానాల్లో బాంబులు పెట్టామని బెదిరింపులు చేస్తున్న నేపథ్యం లో ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.