జె శివసాయివర్ధన్ దర్శకత్వంలో ఎన్‌వీ కిరణ్‌కుమార్ తెరకెక్కనున్న సినిమా ‘భలే ఉన్నాడే’. డైరెక్టర్ మారుతి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో రాజ్‌తరుణ్, మనీషా కంద్కూర్ హీరోహీరోయిన్లు. ఇందులో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 13న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో అభిరామి విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు...
- నా జర్నీ గురించి -రెండు పదాల్లో చెప్పాలంటే.. హ్యాపీ యాక్సిడెంట్ (నవ్వుతూ). నాకు ఎలాంటి సినీ నేపథ్యమూ లేదు. మిడిల్ క్లాస్ అమ్మాయిని. టీవీలో యాంకర్‌గా చేశా. తర్వాత ఫిల్మ్ ఆఫర్స్ వచ్చాయి. కొన్ని సినిమాల తర్వాత యూఎస్ వెళ్లి చదువుకున్నా. పెళ్లి చేసుకొని అక్కడే కొన్నాళ్లు ఉన్నా. ఇదొక వండర్ ఫుల్ జర్నీ. నచ్చిన వృత్తిలో ఉన్నాను. నేను చాలా లక్కీ.
- నేను ‘మహారాజ’, ‘సరిపోదా శనివారం’ కంటే ముందే ఈ సినిమా ఒప్పుకున్నా. కానీ, ఆ రెండు ముందుగా రిలీజ్ అయ్యాయి. నాకు కథ, క్యారెక్టర్ నచ్చితే మరో ఆలోచన లేకుండా చేస్తా. ‘భలే ఉన్నాడే’లో నా క్యారెక్టర్ పేరు గౌరీ. తను బ్యాంక్ ఎంప్లాయ్. మా అమ్మానాన్న బ్యాంక్ ఉద్యోగులే కావడంతో ఇది నాకు పర్సనల్‌గా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్. -రాజ్‌తరుణ్ గుడ్ యాక్టర్. ఇందులో తనది శారీ డ్రాపర్ క్యారెక్టర్. శారీని ఎలా టై చేస్తారో కొంచెం గైడ్ చేశా. అంతే తప్ప ప్రత్యేకంగా ఆయనకు సలహాలేమీ ఇవ్వలేదు.
- పదేళ్ల క్రితం తమిళంలో నా రీఎంట్రీ జరిగింది. కమల్‌హాసన్ గారి ‘విశ్వరూపం’ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పడానికి యూఎస్ నుంచి వచ్చాను. అప్పటినుంచి చాలా మంది క్యారెక్టర్స్ కోసం అప్రోచ్ అయ్యారు. నేను మాత్రం సెలక్టివ్‌గా చేస్తున్నా. గత రెండేళ్లలో పది సినిమాలు చేశాను. ఇప్పుడు ఇండియాలోనే ఉన్నా. కొత్తగా -రెండు తెలుగు కథలు విన్నా. తర్వాతలోనే వాటి గురించి చెప్తా. -ఇంట్రస్టింగ్ రోల్స్ చేయాలని ఉంది. తమిళంలో లీడ్ రోల్‌లో రెండు సినిమాలు చేస్తున్నా. -కమల్‌హాసన్, మణిరత్నం గారి సినిమా కోసం ఇటీవలే నా పోర్షన్ పూర్తి చేశా. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.