calender_icon.png 2 February, 2025 | 8:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల ఆశీర్వాదముతోనే విజయం సాధించాను..

26-01-2025 11:17:46 PM

మీ ఆకాంక్షల మేరకు అభివృద్ధి చేస్తా...

దామర చెరువులో నాలుగు పథకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు...

రామాయంపేట (విజయక్రాంతి): మీ ఆదరణ, మీ ప్రేమ, ఆప్యాయతలు చూపి తనకు ఓట్లేసి గెలిపించి నందుకు ఈరోజు తాను ఎమ్మెల్యేగా విజయం సాధించి మీ ముందుకు వచ్చానని, మీ ఆకాంక్షలకు అనుగుణంగానే మెదక్ నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు రామాయంపేట మండలంలోని దామరచెరువు గ్రామంలో నాలుగు పథకాలను ఆయన ప్రారంభించారు.. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించి ఎంపికైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే రోహిత్ రావు సర్టిఫికెట్స్ ను ప్రధానం చేశారు. సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని అధికారులు ఆడియో ద్వారా చూపించి, వీడియో ద్వారా ఆయన ప్రసంగాన్ని వినిపించారు. 

అనంతరం జరిగిన బహిరంగ సభలో రోహిత్ రావు మాట్లాడుతూ... గత పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఈనాడు అయినా గ్రామ సభలు నిర్వహించి ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని ఆయన ప్రశ్నించారు.. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి కూడా మెదక్ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకున్నారా? అని నిలదీశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గ్రామాల్లో అధికారుల సమక్షంలోనే లబ్ధిదారులను ఎంపిక చేసి పారదర్శకంగా వారిని గుర్తించనున్నట్లు తెలిపారు. గత మేనిఫెస్టోలో తమ పార్టీ ఇచ్చిన హామీ మేరకు సంవత్సరకాలంలోనే ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయడంతో పాటు నిరుపేదలందరికీ తమ ప్రభుత్వం అండగా నిలబడుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రవేశపెట్టి వాటిని ప్రజలకు చేరవేస్తామని తెలిపారు. ప్రజలు సంక్షేమ పథకాలను సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ప్రభుత్వానికి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావాలని ఒకవైపు ప్రజలు కోరుకుంటూ ఉంటే, మరోవైపు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పథకాలు ప్రజలకు చేరకుండా ఉండడానికి ఆటంకాలు కలిగిస్తున్నారని తెలిపారు.. రాష్ట్రంలో ఇకనుంచి టిఆర్ఎస్ పార్టీ ఆటో సాగవన్నారు.. రాష్ట్రంలోనే మెదక్ శాసనసభ నియోజకవర్గాన్ని ముందు వరుసలో నిలబెడతారని హామీ ఇచ్చారు, ఏడుపాయల దేవస్థానం, మెదక్ లోని చర్చి అభివృద్ధి కోసం కోట్లధి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న పాలకులు ఏనాడు అభివృద్ధి వైపు కన్నీటి చూడలేదని ఆరోపించారు.. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, రామాయంపేట తహసిల్దార్ రజనీకుమారి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ పడాల శివప్రసాదరావు, రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్ లు యాదగిరి, చిలుక గంగాధర్, సుందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చౌదరి సుప్రభాతరావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కుస్తీ సిద్ధ రాములు, రాజా గౌడ్, స్వామితో పాటు మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.