calender_icon.png 21 January, 2025 | 9:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘నీవల్లే నేను గర్భం దాల్చాను’

07-12-2024 02:31:22 AM

  1. రూ.కోటి ఇవ్వకుంటే పరువు తీస్తా
  2. వాజేడు ఎస్సైని బెదిరించిన కి‘లేడీ’?
  3. హరీశ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి.. 

జనగామ, డిసెంబర్ 6(విజయక్రాంతి): ములుగు జిల్లా వాజేడు ఎస్సై హరీశ్ ఆత్మహత్యకు సంబంధించి పోలీసుల విచార ణలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. పక్కా పథకం ప్రకారమే ఓ యువతి ఎస్సైని వలలో వేసుకొని డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేసినట్టు తెలుస్తున్నది.

వివరాలిలా.. ఎస్సై హరీశ్‌కు కొంతకాలం కిందట ఇన్‌స్టాగ్రాంలో సూర్యాపేట జిల్లాకు చెందిన ఓ యువతితో పరిచయమైంది. మాయమాటలతో హరీశ్‌కు దగ్గరైన ఆ యువతి పక్కా స్కెచ్‌తో అతడికి దగ్గరవుతూ వచ్చింది. ఒకానొక సందర్భంలో ఇద్దరూ శారీరకంగా కలిశాక సదరు యువతి గేరు మార్చింది.

హరీశ్‌కు ఆయన కుటుంబసభ్యులు ఓ పెళ్లి సంబంధం చూడగా.. ఇదే అదనుగా భావించిన ఆమె ఎస్సైని బ్లాక్‌మెయిల్ చేసింది. ‘నీ వల్ల నేను గర్భం దాల్చాను.. నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఊరుకోను.. కేసు పెట్టి నీ కెరీర్ నాశనం చేస్తాను’ అని బెదిరించినట్లుగా తెలిసింది.

రూ.కోటి ఇస్తే తన దారిని తాను పోతానని, లేదంటే వదిలిపెట్టనని తేల్చిచెప్పడంతో దిక్కుతోచని స్థితిలో ఎస్సై ఆత్మహత్మకు పాల్పడినట్లు తెలుస్తోంది. సదరు కి‘లేడీ’ ఇంతకుముందు ఇదే తరహాలో సూర్యాపేట జిల్లా చిలుకూరు, కోదాడ, ఎల్‌బీనగర్, హయత్‌నగర్ పోలీస్టేషన్ల పరిధిలో పలువురు యువకులను మోసం చేసి కేసులు పెట్టినట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్న పోలీసులు ఒకంట్రెండు రోజుల్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నది.