calender_icon.png 17 April, 2025 | 7:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కథ విన్నప్పుడే కొత్త అనుభూతికి లోనయ్యా: నాని

16-04-2025 12:00:00 AM

స్టార్ హీరో నాని నుంచి వస్తున్న తాజాచిత్రం ‘హిట్3: ది థర్డ్ కేస్’. డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. మే 1న విడుదల కానున్న ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ సంద ర్భంగా చిత్రబృందం ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సమావేశంలో హీరో నాని, డైరెక్టర్ శైలేశ్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాని మాట్లాడుతూ.. “ఈ మధ్య చివరి నిమిషంలో ట్రైలర్స్ ఇస్తున్నారు.

ఇంతకుముందు 20 రోజులు ముందే ట్రైలర్ వచ్చేది. ఆ నోస్టా ల్జిజియా ఫీలింగ్ మళ్లీ ఇద్దామని ట్రైలర్‌ను ముందుగానే రిలీజ్ చేశాం. టీజర్‌తోనే సినిమా ఎలా ఉంటుందనేది ప్రేక్షకులు ఓ అవగాహనకు వచ్చారు. ఇంకాస్త ఎక్సయిట్‌మెంట్ పెంచడం, ఎంత స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా అనేది చెప్పేందుకే ఇంత ముందుగా ట్రైలర్ ఇచ్చాం. -ఎమోషన్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు వైలెన్స్ పండుతుంది.

ఈ సినిమాలో వైలెన్స్ చూస్తున్నప్పుడు పూనకం వస్తుంది. శైలేష్ ఈ కథ ఐడియా చాగంటికి చెప్పారు. ఆయనకు చాలా నచ్చింది.. అందుకే సినిమా కోసం ప్రత్యేకంగా వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇందులో యాక్షన్ కొరియోగ్రఫీకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. లీ చాలా అద్భుతంగా డిజైన్ చేశారు. ఇంత వైలెన్స్ సినిమా ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపెట్టదు. ఎందుకంటే -మనకన్నా పదింతలు వైలెన్స్ సినిమాలు తీసే దేశాల్లో మన కంటే క్రైమ్ రేట్ తక్కువగా ఉంది.

మన బుద్ధి సరిగ్గా ఉండాలి. సినిమా అనేది బాధ్యత. మేం ఎంత బాధ్యతగా తీశామో సినిమా చూస్తే అర్థమవుతుంది. యాక్షన్ సినిమాలను ఎంజాయ్ చేసే ఆడియన్స్‌కు హిట్3 లాంటి రెసీ థ్రిల్లర్ ఫుల్ మీల్స్. ఇది కరెక్ట్ కాదనిపిస్తే తర్వాత నానిని నమ్మకండి (నవ్వుతూ). కథ విన్నప్పుడే కొత్త అనుభూతికి లోనయ్యా. శైలేశ్ చాలా కొత్తగా సినిమాను డీల్ చేశాడు.

చాలా విషయాలు నాకే కొత్తగా అనిపించాయి” అన్నారు. డైరెక్టర్ శైలేశ్ మాట్లాడుతూ.. ‘అర్జున్ క్యారెక్టర్‌కు స్ఫూర్తి అంటూ ఏమీ లేదు. -ఇది లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్. ఫిక్షనల్‌గానే క్రియేట్ చేశాం. -ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. ధర్మం కోసం నిలబడ్డ మనిషి ఎంత దూరం వెళ్లాడనేది ఇందులో చూస్తారు’ అని తెలిపారు.