calender_icon.png 23 September, 2024 | 12:26 PM

ఇంతమంది గొప్ప నటులతో వర్క్ ఎంజాయ్ చేశా

22-09-2024 12:00:00 AM

సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘వేట్టైయాన్-: ది హంటర్’. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రచార కార్యక్రమాలు జోరుగా నిర్వహిస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్న మంజు వారియర్ సినిమాలో తాను భాగమైన విధానం గురించి పలు సందర్భాల్లో చెప్పింది.  “తమిళంలో నేను ‘అసురన్’, ‘తునివు’ సినిమాలు మాత్రమే చేశాను. ఆ రెండు సినిమాలతోనే నాకు ఇక్కడ దొరికిన ఆదరణ చూస్తుంటే మాటలు రావటం లేదు. ఇప్పుడు చేస్తున్న ‘వేట్టైయాన్’ మూడో సినిమా. ‘జై భీమ్’ చూసిన తర్వాత జ్ఞానవేల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనుకున్నా.

అయితే, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం ఇంత త్వరగా వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. రజినీగారు, అమితాబ్‌గారు, లైకా ప్రొడక్షన్స్, ఫహాద్, రానా.. ఇలాంటి యాక్టర్స్ ఇంత మందితో కలిసి వర్క్ చేయటాన్ని ఎంజాయ్ చేశాను. సూపర్‌స్టార్‌గారి గురించి చెప్పాలంటే 50 ఏళ్ల ఆయన ప్రయాణం అసాధారణం. ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లో ఆయనెంతో ఇన్‌స్పిరేషన్. ఆయనతో వర్క్ చేయటం డ్రీమ్ కమ్ ట్రు అనిపించింది” అని చెప్పుకొచ్చింది మంజు.