04-03-2025 12:00:00 AM
‘దబాంగ్’ మూవీతో బాలీవుడ్‌లోకి సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రమే అమ్మడికి మంచి పేరు సంపాదించి పెట్టింది. అయితే ఎందుకో గానీ ఆ తరు వాత చిత్రాలేవీ ఆమెకు కలిసి రాలేదు. ‘అఖిరా, లుటేరా, ఫోర్స్ 2’ వంటి చిత్రాల్లో ఈ ముద్దుగుమ్మ మెరిసింది. పెర్ఫార్మెన్స్ రోల్స్‌తో అలరించింది. కానీ వీటి లో ఒక్క సినిమా కూడా అమ్మడికి కలిసి రాలేదు. దీంతో సోనాక్షి కెరీర్ నత్తనడకన సాగింది.
మరి కెరీర్‌లో గ్రోత్ లేదనో... మరో కారణమో కానీ జహీర్ ఇక్బాల్‌ను సోనాక్షి వివాహం చేసుకుంది. అయితే ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో స్విమ్ సూట్ వేసుకోవడంపై సోనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇండియాలో ఉంటే తాను అసలు స్విమ్ సూట్ వేసుకోనని.. విదేశాలకు వెళ్లినప్పుడు మాత్రమే వేసుకుంటానని చెప్పింది. ఇండియాలో బికినీ వేసుకుంటే ఎక్కడి నుంచి ఎవరు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేస్తారోనన్న భయమే అందుకు కారణమని సోనాక్షి చెప్పుకొచ్చింది. అమ్మడి వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.