29-03-2025 12:42:06 AM
బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ ప్రధాన పాత్ర లో నటిస్తున్న తాజాచిత్రం ‘కేసరి చాప్టర్2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్‌వాలాబాగ్’. చారిత్రక కథా నేపథ్యంలో కరణ్‌సింగ్ త్యాగి దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్, కేప్ ఆఫ్ గుడ్‌ఫిల్మ్స్ సంస్థ సంయు క్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో విడుద లై విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ‘కేసరి’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతోందీ సినిమా.
దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయం.. 1919 అమృత్ సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ ఊచకోత ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై మొద ట్నుంచీ భారీ అంచనాలున్నాయి. ఇటీవల మేకర్స్ విడుదలచేసిన టీజర్‌కు విశేష స్పందన దక్కింది. తాజాగా ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ ఆ పాత్రల లుక్‌పోస్టర్లను సామాజిక మాద్య మాల వేదికగా పంచుకుంది చిత్రబృందం.
ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నటి అనన్య పాండే పాత్రకు సంబంధించిన టీజర్ ఆకట్టుకుంటోంది. ‘ఉస్ దిన్ జలియన్‌వాలాబాగ్ మే జో హువా ఉస్ కా సచ్ పూరీ దునియా కో పతా చల్నా చాహియే (ఆరోజు జలియన్‌వాలాబాగ్‌లో ఏం జరిగిందో, నిజం అందరికీ చెప్పాలి)” అంటూ అనన్య వాయిస్ ఓవర్ ఉత్తేజాన్ని రేకెత్తిస్తున్నాయి.
కోర్టు డ్రామాలో బ్రిటిష్ న్యాయమూర్తిని ఉద్దేశించి ‘నువ్వు ఇప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్యానికి బానిసవని మర్చిపోవద్దు’ అంటూ అక్షయ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. అక్షయ్‌కుమార్.. బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎదిరించే న్యాయవాది సీ శంకర్ నారాయణ్‌గా శక్తిమంతమైన పాత్రలో కనిపించనుండగా, దిల్రీత్ గిల్ పాత్రలో అనన్య నటిస్తోంది. ఆర్ మాధవన్ నెవిల్లే మెకిన్లీ పాత్రను పోషిస్తున్నారు. మరికొందరు నటీనటుల క్యారెక్టర్ పోస్టర్లను కూడా విడుదల చేశారు.