calender_icon.png 19 April, 2025 | 7:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాళ్లు నాకు ఏమాత్రం కనిపించరు

14-04-2025 12:31:12 AM

టివీ నటిగా కెరీర్ ఆరంభించి, సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ మౌనీరాయ్. ‘నాగిని’ అనే ధారావాహికంతో అన్ని భాషల్లోని ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు అక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన ‘గోల్డ్’ చిత్రంతో తొలిసారి వెండితెరపై మెరిసింది. ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి పాపులర్ అయ్యింది.

ప్రస్తుతం ఆమె ‘ది భూత్నీ’ సినిమాలో నటిస్తోంది. ఇందులో డూప్స్ సహాయం లేకుండా తానే స్వయంగా స్టంట్స్ చేశానని, అందుకే ఈ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని ఇటీవల ఓ కార్యక్రమంలో చెప్పుకొచ్చింది మౌని. సంజయ్‌దత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ హారర్ మూవీ ఏప్రిల్ 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రబృందం ఓ ఈవెంట్ నిర్వహించింది. ఇం దులో పాల్గొన్నప్పట్నుంచి మౌనీరాయ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆమె లుక్స్ విషయంలో సోషల్ మీడియా వేదికగా కొన్నిరోజులుగా ట్రోల్స్ ఎదుర్కొంటోంది. అందం కోసం మౌనీరాయ్ సర్జరీ చేయించుకుందని, దాంతో ముఖ కవళికలు మారిపోయాయని కామెంట్స్ చేశారు. నెట్టింట వైరల్‌గా మారిన ఈ విమర్శలపై తాజాగా మౌనీరాయ్ స్పందించింది. ‘నాపై కామెంట్స్ చేసేవాళ్లు నాకే మాత్రం కనిపించరు. కాబట్టి వాళ్ల మాటలకు బాధపడాల్సిన అవసరంలేదు. వాటిని నేను పెద్దగా పట్టించుకోను. ఇతరులను ట్రోల్ చేస్తూ సంతోషాన్ని పొందాలనుకుంటే మాత్రం మ నం మాత్రం ఏం చేస్తాం?! ఎవరికి నచ్చినట్టు వాళ్లను ఉం డనివ్వండి’ అన్నది మౌనిరాయ్.