calender_icon.png 7 January, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాకు గాడ్‌ఫాదర్ లేకపాయె!

01-12-2024 01:16:00 AM

ఏ పార్టీలోనైనా ద్వితీయ శ్రేణి నాయకులు తమ పార్టీ కోసం కష్టపడి పని చేస్తుంటారు. నిత్యం మీడియాలో ఉండేందుకు తహతహలాడుతుంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది. పార్టీ కోసం కొట్లాడాలని పెద్ద నాయకులు  సలహాలు ఇస్తుంటారు. అయితే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక సీన్ మారుతుంది.

అప్పటి కష్టాన్ని గుర్తు చేసి పదవులు అడుగుదామని  పెద్ద నాయకుల వద్దకు వెళ్లితే మోహం చాటేస్తున్నారట. నిత్యం పదుల సంఖ్యలో మంత్రులు, ఇతర సీనియర్ల వద్దకు క్యూ కడుతున్నారట. అయితే పెద్దవాళ్ల ఆశీస్సులు ఉన్నోళ్లకు అనుకున్న పదవికి హామీ దొరుకుతుందట. మిగతా వారికి చూద్దాం.. చేద్దాం.. అనే మాటలతో వినిపిస్తున్నాయని కాంగ్రెస్ యువ నాయకుల్లో నిరుత్సాహం కనిపిస్తుందట. నాకు ఓ ‘గాడ్ ఫాదర్’ ఉండుంటే బాగుండేది అని నిట్టూర్పు విడుస్తున్నారట.