calender_icon.png 20 April, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెళ్లి కాకున్నా నాకేం పర్వాలేదు

20-04-2025 12:00:00 AM

దక్షిణాదిన రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది త్రిష కృష్ణన్. ఆమె పలువురు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలతో, దర్శక నిర్మాతలతో కలిసి పనిచేశారు. అయితే ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు తరచూ ఎదురయ్యే రొటీన్ ప్రశ్న ‘పెళ్లి ఎప్పుడు?’ అనే! త్రిషకు కూడా తాజాగా ఈ ప్రశ్నే ఎదురైంది. దీనికి ఆమె బదులిచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘థగ్‌లైఫ్’ చిత్రంలో త్రిష కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రబృందం శుక్రవారం చెన్నైలో ప్రెస్‌మీట్ నిర్వహించింది.

ఈ సమావేశంలోనే త్రిషకు మరోసారి ‘పెళ్లి గురించి ప్లాన్స్ ఏంటి?’ అన్న ప్రశ్న ఎదురైంది. “నాకు వివాహంపై సరైన ఉద్దేశం లేదు. నాకు పెళ్లయితే ఓకే. ఒకవేళ పెళ్లి కాకపోయినా నాకేం ఫర్వాలేదు” అని పేర్కొంది. త్రిష సినిమాల విషయానికొస్తే.. ఆమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే ‘విడాముయర్చి’, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాల్లో హీరో అజిత్‌కుమార్‌తో కలిసి ప్రేక్షకులను పలకరించిన త్రిష తెలుగులో చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. కోలీవుడ్‌లో సూర్యతో ఓ సినిమా చేస్తున్నారు.