calender_icon.png 23 December, 2024 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలాంటివి అస్సలు పట్టించుకోను

23-12-2024 01:10:26 AM

తెలుగు చిత్రసీమలో ఇప్పుడిప్పుడే గుర్తింపు తెచ్చుకుంటోంది యువ కథానాయకి సంగీర్తనా విపిన్. ముందు ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన ఈ కేరళ కుట్టి.. ఆ తర్వాత వెండితెర ప్రేక్షకులను పలకరించింది. ఇటీవల తెలుగులో వరుస అవకాశాలను చేజిక్కించుకుంటూ బిగ్‌స్క్రీన్‌పై సందడి చేస్తోంది. నిరుడు ఈ ముద్దుగుమ్మ నటించిన ‘నరకాసుర’ సినిమా కమర్షియల్ హిట్ అందుకోలేకపోయింది.

కానీ ఆమె నటనకు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత ‘ఆపరేషన్ రావణ్’తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. అయినా తెలుగులో వరుస ఆఫర్లు మా త్రం తగ్గలేదు. ఇటీవల సుహాస్‌తో జతకట్టిన ‘జనక అయితే గనక’ సినిమాతోనే క్రేజ్ సొంతం చేసుకుందీ బ్యూటీ. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

‘నేను నటించిన సినిమా ప్లాప్ అయిన ప్రతిసారి ఈ ఫీల్డ్ నీకు సెట్ కాదు.. వేరే ప్రొఫెషన్ చూసుకో అంటూ చాలా మంది నన్ను నిరుత్సాహానికి గురిచేశారు. అలాంటి మాటలతో వెనక్కిలాగే ప్రయత్నం చేస్తుంటారు. అయినా అలాంటి నెగిటివ్ కామెంట్స్‌ను నేను అస్సలు పట్టించుకోను’ అని చెప్పుకొచ్చింది సంగీర్తన.