calender_icon.png 27 November, 2024 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ఏం మాట్లాడుతున్నారో.. అర్థం కావడం లేదు

27-11-2024 04:56:08 PM

హైదరాబాద్: గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కూమర్, తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో  చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరణ పెరుగుతుందన్నారు. కేటీఆర్ గత కొన్ని రోజులుగా ఏం మాట్లాడుతున్నారో.. ఎందుకు మాట్లాడుతున్నారో.. అర్దం కావడంలేదన్న భట్టి విక్రమార్క కాంగ్రెస్ మంత్రులంతాా పనిమంతులేనని తెలిపారు. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు చేస్తున్నామన్నారు. 

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. పని లేని విమర్శలతో ప్రతిపక్షాలకు ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని ఓర్వలేక కొందరు కాకుల్లా అరుస్తున్నారని విమర్శించారు.  హై డ్రా, మూసీ నది విషయంలో ఆలోచన చేసే ముందుకు పోతున్నామని వెల్లడించారు. మూసీ విషయంలో హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. మూసీ నిర్వాసితులు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ధరణిని అడ్డు పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం 24 లక్షల ఎకరాలు కాజేసిందని, బీఆర్ఎస్ కాజేసిన భూముల వ్యవహారాన్ని త్వరలోనే బయటకు తీస్తామని ఉపముఖ్యమంత్రి పేర్కొన్నారు.