calender_icon.png 18 October, 2024 | 1:32 PM

అలాంటి విషయాలు పట్టించుకోను

27-07-2024 12:42:56 AM

‘తనదైన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకుల గుండె గుడిలో కొలువుదీరిపోయింది స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్. ఇటీవల బాలీవుడ్‌లోనూ జోరు పెంచిందీ భామ. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రఘుతాత’ ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందంతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొం టోంది కీర్తి. ‘రఘుతాత’కు సంబంధించి ఏ ఈవెంట్ నిర్వహించినా కీర్తినే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆ సందర్భంలో బంధించిన ఫొటోలు, వీడియోలు గంటగంటకూ సెల్‌ఫోన్లలోకి దూరిపోతున్నాయి. తగుదునమ్మా అంటూ సోషల్ మీడియా సమాజం కూడా కీర్తికి సంబంధించిన మరిన్ని చిత్రవిచిత్రాలను జోడి స్తూ రూమర్స్‌ను వదులుతోంది. అదీగాక ‘రఘుతాత’ ప్రమోషన్స్‌లో భాగంగా అభిమానులతో సాగించిన ముచ్చట్లలో కీర్తి పెండ్లి ప్రస్తావన కూడా వచ్చింది.

‘కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన క్లోజ్ ఫ్రెండ్‌నే వివాహమాడతారంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నా స్పందించ టంలేదేం?’ అన్నదే ఆమెకు ఎదురైన ప్రశ్న. దీనికి సమాధానంగా ఈ అమ్మడు మాట్లాడుతూ.. ‘నా వ్యక్తిగత జీవితం, కుటుంబం గురించి వచ్చే కామెంట్స్‌ను నేను పరిగణలోకి తీసుకోను. వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఏదైనా రూమర్‌పై మనం క్లారిటీ ఇస్తే అందరూ అది నిజమేనని భావిస్తారు. అందుకే అలాంటి విషయాలపై నేను స్పందించను. నా నటన గురించో, సినిమాల ఎంపిక గురించో వివరణాత్మక విమర్శలు చేస్తే మాత్రం స్వీకరిస్తా. వాటి ద్వారా కొత్త విషయాలు నేర్చుకోవడానికీ ఇష్టపడతా’ అని చెప్పుకొచ్చింది.