calender_icon.png 26 October, 2024 | 7:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలాంటి వాటిలో నటించను

23-10-2024 12:00:00 AM

చిత్రసీమలో అందరు నటీమణుల్లా కాదు నిత్యామీనన్. పారితోషికం ఎక్కువ అనో లేదంటే పెద్ద సిని మా అనో ఏ పా త్రకు పడితే ఆ పాత్రకు ఓకే చెప్ప రు. అలాగని నచ్చి తే చాలు.. సినిమా చిన్నదా, పెద్దదా అని చూడరు. పైగా అతిథి పాత్ర అయినా నటించేస్తారు. ఆమె కృషికి ఇన్నాళ్లకు ఫలితం దక్కింది. 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.

‘తిరు’ సినిమాకు గానూ నిత్యామీనన్‌కు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రంలో హీరో స్నేహితురాలిగా నటించిన నిత్య తన నటనతో ఆకట్టుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన పాత్రల ఎం పిక గురించి నిత్యా మీనన్ మాట్లాడారు. “70వ చలనచిత్ర అవా ర్డుల్లో ఎంపికవుతానని ఊహించలేదు.

అవార్డులు, రివార్డుల కోసం కాకుండా సంతోషాన్నిచ్చే పాత్రలో నటించాలనుకున్నా. దానిని దృష్టిలో పెట్టుకునే పాత్రలు ఎంపిక చేసుకుంటా. భారీ బడ్జెట్ సినిమాల్లో అవకాశం వచ్చినా పాత్ర నచ్చకుంటే నటించను. మంచి పాత్ర అయితే చిన్న సినిమా అయినా ఓకే చెప్పేస్తా” అని నిత్యామీనన్ పేర్కొన్నారు. ప్రస్తుతం నిత్య ‘గోల్డెన్ వీసా’, ‘ఇడ్లీ కడై’ చిత్రాల్లో నటిస్తున్నారు.