తెలుగులో నటించింది రెండు సినిమాలే అయినా.. తన అందం, అభినయంతో సినీప్రియుల హృదయాలను కొల్లగొడుతోందీ ఆషికా రంగనాథ్. త్వరలో చిరంజీవి ‘విశ్వంభర’లో కనిపించనుంది. అంతకుముందు ఈ నెల 29న విడుదల కానున్న ‘మిస్ యూ’తో ప్రేక్షకులను పలకరించనున్న ఈ అమ్మడు ఓ సందర్భంలో తన గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ‘డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే బెల్లీ, వెస్ట్రర్న్ వంటి వాటిల్లో ప్రత్యేక కోర్సులు చేశా..
ఉత్సాహంగా ఉండేందుకు దాన్నే ఆశ్రయిస్తా. చిన్నప్పట్నుంచీ తెలుగు సినిమాలు చూస్తూ, పాటలు వింటూ పెరిగా.. అందుకే తెలుగు భాష అంటే ఇష్టం. హిందూ సంప్రదాయాలన్నా, పండుగలప్పుడు కుటుంబాన్ని కలువడమన్నా, వారితో భోజనం చేయడమన్నా మహా సరదా. అందుకే ఏ పండుగనూ మిస్ చేసుకోను. మోడ్రన్ దుస్తులు ఎన్ని ఉన్నా లెహెంగా చూస్తే మనసు పారేసుకుంటా..
షాపింగ్‌కు వెళితే కొనకుండా ఆగలేను. నా ఫేవరెట్ ప్లేస్ ఐలాండ్. షూటింగ్ నుంచి విరామం దొరికితే.. ఏదో ఒక ఐలాండ్‌కి వెళ్లాల్సిందే’ అని చెప్పుకొచ్చింది ఆషికా. ఇంకా తన కెరీర్ గురించి చెప్తూ.. ‘కొత్త ప్రయత్నాలు చేస్తూ, నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ముందుకు సాగాలన్నదే నా లక్ష్యం. ఎప్పటికైనా రాజమౌళి సినిమాలో నటించాలన్నది నా కల’ అని తన మనసులోని మాటను బయటపెట్టిందీ బ్యూటీ.