calender_icon.png 13 February, 2025 | 7:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రోల్ చేస్తారనుకోలేదు

13-02-2025 01:47:37 AM

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమాలో ఊర్వశి రౌతేలా ఒక హీరోయిన్‌గా నటిం చింది. ఈ చిత్రంలో బాలకృష్ణతో కలిసి ఆమె ‘దబిడి దిబిడి’ పాటకు డ్యాన్స్ చేయడం.. అది కాస్తా కాంట్రవర్సీకి దారి తీసింది. దానిపై తాజాగా ఊర్వశి రౌతేలా స్పందించింది.

“ప్రశాంతంగా రిహార్సల్స్ జరిగాయి. పాటలకు కొరియోగ్రఫర్ ఎలా చెబితే అలా డ్యాన్స్ చేశాం. దబిడి దిబిడి పాటకు శేఖర్ మాస్టర్ డ్యాన్స్ కొరియోగ్రఫీ చేశారు. ఆయన స్టెప్పులు చెప్పినప్పుడు నాకు ఏమాత్రం అభ్యంతరకరంగానూ.. విభిన్నంగానూ అనిపించలేదు. సాధారణమైన స్టెప్పుల మాదిరిగానే భావించా.

కానీ పాట విడు దలయ్యాక సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ చూసి షాక్ అయ్యా. అసలు కొరియోగ్రఫీని తప్పులు బట్టేందుకు కారణమేంటో తెలియలేదు. ” అని తెలిపింది. సంక్రాం తి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రాన్ని దర్శకుడు బాబీ రూపొందించారు.