calender_icon.png 15 March, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆయేషా, సత్యంబాబు కేసు నేనైతే స్టడీ చేయలేదు

11-03-2025 12:00:00 AM

నాని, వాల్ పోస్టర్ సినిమా సమర్పిస్తున్న చిత్రం ‘కోర్ట్’ స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ అనే క్యాప్షన్‌తో తెరకెక్కింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. ఈ చిత్రం మార్చి 14న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ప్రియదర్శి మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నారు. 

‘కోర్ట్’ సినిమా ప్రయాణం ఎలా మొదలైంది? 

2022లో నేను, రామ జగదీష్ వేరే సినిమా చేస్తున్న టైంలో ఒక డిస్కషన్‌లో భాగంగా రామ్ జగదీష్ ఒక ఐడియా ఉందని చెప్పారు. సరే కథ రాసుకొని రమ్మని చెప్పాను. ఒక ఆరు నెలలకి కథ మొత్తం రాసుకుని తీసుకోవచ్చాడు. ఈ సినిమా గనుక హిట్ అయితే ప్రేక్షకులకు గుర్తుండిపోయి సినిమా అవుతుంది అని గట్టి నమ్మకం కలిగింది. ఆ తరువాత ‘హాయ్ నాన్న’ సినిమా చేస్తున్న టైంలో నాని అన్న కథ విన్నారు. ఆ వెంటనే కథ ఓకే చేశారు. అలా ఈ స్టోరీ స్టార్ట్ అయింది. 

లాయర్ పాత్రలో మొదట మిమ్మల్ని అనుకున్నారా? 

ఈ కథ చెప్పినప్పుడు అలానే రాసేటప్పుడు ఎవరైనా పెద్ద ఆర్టిస్ట్ చేస్తే బాగుంటుంది అని అనుకున్నా డు రామ్ జగదీష్. కానీ నేను ఈ క్యారెక్టర్ చేస్తానని చెప్పడంతో సరేనని ఒప్పుకున్నారు.

ఈ కేరక్టర్ కోసం ఎంత హోం వర్క్ చేశారు?

ప్రతి కోర్టు రూమ్ డ్రామాలో ముఖ్యంగా మనకి ఎవిడెన్స్, ఫ్యాక్ట్స్ అలానే వాటికి అమలు అయ్యే చట్టాలు ఇవన్నీ కూడా మనకి కొంత మేరకు తెలియాలి. అలానే కొంత మంది లాయ ర్ల దగ్గరికి వెళ్లి పోక్సో కేసు అంటే ఏమిటి దానికి ఎలాంటి శిక్షలు ఉంటాయి అన్నీ తెలుసుకుని ఒక మెటీరియల్ తయారు చేసి నాకు రామ్ జగదీష్ ఇచ్చాడు. నేను కూడా కోర్టులో ఎలా వ్యవహరించాలి? ఎంలాంటి బట్టలు వేసుకోవాలనే విషయాలపై స్టడీ చేశా. సెక్షన్లు కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకున్నాను.

‘స్టేట్ వర్సెస్ ఏ నోబడి” క్యాప్షన్ పెట్టడానికి రీజనేంటి?

ఒకడు దొంగతనం చేసి పోలీసులకు దొరికితే, అతను నేరస్తుడు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు మనం కోర్టు భాషలో చెప్పాలి అంటే స్టేట్ వర్సెస్ అక్యూస్‌డ్ అని అం టాం. చట్టానికి అందరూ ఒకటే అనే సైన్‌తో అలా పెట్టాం.

ఆయేషా, సత్యంబాబు కేసు స్టడీ చేశారా?

ఆ కేసు గురించి నాకు ఐడియా ఉంది. అప్పట్లో ఈ కేసు ఒక సెన్సేషన్. దీని గురించి నేను అయితే స్టడీ చేయలేదు. రామ్ జగదీష్ ఏమైనా స్టడీ చేశారేమో కనుక్కోవాలి.

మీ డ్రీమ్ రోల్?

శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ కే ఐ వరప్రసాద్ గారి బయోపిక్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది.