కీర్తి సురేశ్ నటించిన తాజా చిత్రం ‘రఘు తాత’ ఈ నెల 15న విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు ‘బేబీ జాన్’ అనే సినిమాలో వరుణ్ ధావన్‌తో జోడీ కట్టడం ద్వారా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుందీ తమిళ సోయగం. ఇటీవల ఎస్.ఎస్ అనే ఓ పాడ్‌కాస్ట్‌లో మనసు విప్పిన ఈ చిన్నది.. తన రిలేషన్‌షిప్ స్టేటస్‌నూ వెల్లడించి, అభిమానులందరినీ సంభ్రమాశ్చర్యానికి గురి చేసింది. “వర్క్ లైఫ్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. మనసుకు నచ్చిన చిత్రాల్లో నటిస్తున్నా. కెరీర్ ఆరంభంలో నేను నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దాంతో నేను ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నా.
నాకు తెలిసి అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని నేనే. ‘మహానటి’ తర్వాత నాపై ట్రోల్స్ తగ్గాయి. విమర్శలను నేను కూడా స్వాగతిస్తా. వివరణాత్మక విమర్శల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. కానీ, కొంతమంది ఉద్దేశపూర్వకంగానే నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. వాటిని పెద్దగా పట్టించుకోను. ఎక్కడా రియాక్ట్ కాను. కాలమే అన్నింటికీ సమాధానం చేప్తుందని భావిస్తున్నా” అని తెలిపింది కీర్తి సురేశ్. ఈ అమ్మడు తన పెళ్లి గురించి చెప్తూ.. ‘ఇద్దరు వ్యక్తులు పరస్పరం గౌరవించుకుంటూ జీవితాన్ని కొనసాగించటమే పెళ్లి అని నేను భావిస్తాను’ అని తెలిపింది కీర్తి.
దీంతో విలేకరి ‘సింగిల్‌గా ఉంటున్నారు.. బోర్‌గా అనిపించటం లేదా?’ అని ప్రశ్నించగా, ‘సింగిల్ అని నేనెప్పుడూ చెప్పలేదుగా..’ అని నవ్వుతూ బదులిచ్చింది. ఇలా కీర్తి సురేశ్ తన రిలేషన్‌షిప్ గురించి తాజాగా చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె రిలేషన్‌లో ఉందని, అదే విషయాన్ని ‘నేను సింగిల్ కాదు’ అంటూ పరోక్షంగా చెప్పిందని అందరూ మాట్లాడుకుంటున్నారు.