శివకుమార్ రామచంద్రవరపు, నితిన్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కింది ‘నరుడి బ్రతుకు నటన’ చిత్రం. శృతి జయన్, ఐశ్వర్య అనిల్‌కుమార్, వైవా రాఘవ, ఇతర ప్రముఖ తారాగణంతో వచ్చిన ఈ చిత్రానికి రిషికేశ్వర్ యోగి దర్శకత్వం వహించారు. టీజీ విశ్వప్రసాద్, సుకుమార్ బోరెడ్డి, డాక్టర్ సింధురెడ్డి నిర్మాతలు. అక్టోబర్ 25న విడుదలైన తమ సినిమాకు ప్రేక్షకాదరణ దండిగా లభిస్తోందని చెబుతోందీ చిత్రబృందం.
ఈ మేరకు వారు థ్యాంక్స్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో శివకుమార్ రామచంద్రవరపు, దర్శకుడు రిషికేశ్వర్ యోగి మాట్లాడుతూ.. ‘మా సినిమాను ప్రేక్షకులు ఇంత బాగా ఆదరిస్తారని మేం కూడా ఊహించలేదు’ అన్నారు. ‘మాలాంటి కొత్తవారిని ప్రోత్సహిస్తుంటే ఇంకా మంచి చిత్రాలు చేస్తాం’ అని నిర్మాత సింధురెడ్డి అన్నారు.