calender_icon.png 27 February, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేను పార్టీ మారలేదు

27-02-2025 01:55:23 AM

  • నా అనుమతి లేకుండానే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో నా ఫొటో వేశారు
  • పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు... ఆలస్యంగా వెలుగులోకి 

గద్వాల, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): నేను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచానని నేను పార్టీ మారలేదని కొంతమంది కాంగ్రెస్  నాయకులు, కార్యకర్తలు నా అనుమతి లేకుండా ఆ పార్టీ ఫ్లెక్సీల్లో నా ఫొటో వేశారని . ఇలా వేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేలా చేశారు. అటువంటి వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది.

ఎమ్మెల్యేగా గెలుపొందిన కొంత సమయంలోనే రాష్ర్టంలోని పలువురు ఎమ్మెల్యేలతో పాటు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సైతం రాష్ర్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు  జోరుగా ప్రచారం జరిగిన విషయం అందరికి తెలిసిందే .. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనరత వేటుపడే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతుండడంతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తాను పార్టీ మారలేదు అని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తమ ఫొటోలను ఉపయోగించి ఫ్లెక్సీలు వేశారని అటువంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈనెల 11వ తేదీన గద్వాల టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు రిజిస్టర్ చేసి ఫ్లెక్సీలు వేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది.