13-03-2025 01:35:37 AM
విమానాశ్రయంలో రన్యారావుకు ఎస్కార్ట్‌గా వ్యవహరించిన కానిస్టేబుల్
బెంగళూరు, మార్చి 12: అక్రమ బంగారం కేసులో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన రన్యారావు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. విమానాశ్రయంలో రన్యారావుకు సహాయం చేసిన కానిస్టేబుల్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా అతడి వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రన్యారావుకు సహకరించినట్లు సదరు కానిస్టేబుల్ కోర్టులో తెలిపాడు.
రన్యారావు బెయిల్ పిటిషన్‌కు సంబంధించిన వాదనలను కోర్టు ఈ నెల 14న విననుంది. పలు సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రన్యారావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.
రన్యా ఆప్తులపై సీబీ‘ఐ’
రన్యారావుతో సన్నిహితంగా ఉన్నవారి జాబితాను సీబీఐ సేకరిస్తోంది. ఇందులో భాగంగా ఆమె వివాహానికి ఎవరెవరు హాజరయ్యారు? వారు ఏం బహుమతులు తీసుకొచ్చారు అనే వివరాలను సీబీఐ ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే కన్నడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా రన్యారావు వివాహానికి హాజరయినట్లు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీంతో బంగారం స్మగ్లింగ్‌కు సీఎంకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అనుమానం బలపడుతోంది. రన్యారావు వివాహం అయిన హోటల్‌కు వెళ్లి మరీ సీబీఐ అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.
సీఐడీకి సారీ..
ఈ కేసులో రాష్ట్ర పోలీసుల పాత్రపై సీఐడీ దర్యాప్తుకు అనుమతిస్తూ కన్నడ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. మంగళవారం నాడు సీఐడీకి అనుమతిస్తూ కన్నడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మార్చి 3న బెంగళూరు విమానాశ్రయంలో రన్యారావు రూ. 12.86 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే.