calender_icon.png 31 January, 2025 | 4:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాప్రయోజనం కోసమే చేశా..

30-01-2025 12:49:08 AM

  • “యమునా విషపూరితం” వ్యాఖ్యలపై కేజ్రీవాల్

ఈసీకి సమాధానం చెప్పిన ఆప్ నేత

కేజ్రీకి హర్యానా కోర్టు సమన్లు

న్యూఢిల్లీ, జనవరి 29: యము నా నదిలో హర్యానా ప్రభుత్వం కావాలనే కలుషితాలు కలుపుతోందని ఆప్ అధినేత కేజ్రీవాల్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. ఆయన లేఖపై స్పందించిన ఎన్నికల సంఘం బుధవారం రాత్రి 8 గంటల వరకు ఈ ఆరోపణలకు సంబంధించి సాక్ష్యా లు చూపాలని ఆదేశించింది. 

అందుకే అలా అన్నా.. 

ఆప్ బాస్ కేజ్రీవాల్ “యమునా విషపూరితం” వ్యాఖ్యలపై స్పందించారు. ‘కలుషిత నీటి వల్ల ఢిల్లీలో జనాల ఆరోగ్యం పాడవుతుందనే ఉద్దేశంలోనే ఇలా వ్యాఖ్యానించా. నేను ఎన్నికల నియమావళిని ఉల్లంఘించలేదు. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతం త్య్రం కిందే ఈ వ్యాఖ్యలు చేశా. ఢిల్లీ వాసుల కు స్వచ్ఛమైన నీటి కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేశా’. అని తెలిపారు. 

హర్యానా కోర్టు సమన్లు

కేజ్రీవాల్‌కు హర్యానా కోర్టు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 17న కోర్టుకు హాజరుకావాలని, ఒక వేళ విచారణకు గైర్హాజరైతే చట్టపర మైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఢిల్లీ సరిహద్దుల్లో హర్యానా సీఎం నయాబ్‌సింగ్ నదిలో నీటిని తాగారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలు దురదృష్టకరం అని తెలి పారు. నయాబ్‌సింగ్ నది నీటిని తాగినట్లు తాగి ఉమ్మేశారని కేజ్రీవాల్ ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. 

ప్రధాని కూడా తాగుతున్నారుగా.. 

నదీ నీటి విషపూరితం గురించి ఢిల్లీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని స్పందించారు. ‘ఆప్ నేతలు ఓటమి భయంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.  నేను కూడా అవే నీళ్లు తాగుతున్నాగా.. ఒక వేళ హర్యానా విషం కలిపితే బయటపడకుండా ఉంటుందా’ అని అన్నారు.