calender_icon.png 28 November, 2024 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఖరి రోజు బాధతో ఏడ్చేశా

28-11-2024 01:06:44 AM

అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన చిత్రం ‘పుష్ప ది రూల్’. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ మంగళవారం పూర్తుంది. ఈ క్రమంలోనే రష్మిక ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఐదేళ్ల పాటు షూటింగ్‌లో పాల్గొనడంతో సెట్ తనకు ఇల్లులా మారిందని.. సెట్‌లోని వారందరినీ మిస్ అవుతున్నానంటూ భావోద్వేగ పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టారు.

“డియర్ డైరీ.. నా జీవితంలో ఎన్నో భావోద్వేగాలతో కూడుకున్న రోజుగా నవంబర్ 25 నిలిచిపోతుంది. ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. 24వ తేదీ సాయంత్రం షూటింగ్ పూర్తి చేసుకుని చెన్నై ఈవెంట్‌కు వెళ్లి అదే రోజు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాం. ఇంటికి వెళ్లి కేవలం నాలుగు గంటల పాటు నిద్రపోయి తిరిగి మరుసటి రోజు షూట్‌కు వచ్చేశా. ఈ సినిమాకు ఇదే నా ఆఖరి రోజు షూట్.

ఆఖరి రోజున స్పెషల్ సాంగ్‌ను రాత్రి వరకూ షూట్ చేశాం. ఇది నాకు ఈ మూవీ సెట్‌లో చివరి రోజులా అనిపించలేదు. ఐదేళ్ల పాటు సినిమా సెట్‌లోనే గడపడంతో ఇది నాకు ఇల్లులా మారింది. ఇప్పటి వరకూ పడిన కష్టం, అలసిన క్షణాలు అన్నీ కళ్ల ముందు మెదిలాయి. మనసు భావోద్వేగంతో నిండిపోయింది. సినిమా కోసం పని చేసిన వారందరనీ మిస్ అవుతానన్న బాధతో ఏడ్చేశా. నాకెందుకు అలా అయిపోయిందో అర్థం కాలేదు” అని రష్మిక తెలిపారు. ‘పుష్ఫ ది రూల్’ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.