calender_icon.png 11 January, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్లైమాక్స్ చూసి కన్నీళ్లొచ్చాయి..

08-01-2025 12:00:00 AM

అరవింద్ కృష్ణ, దివి, మేఘన శ్రీనివాస్, వినయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘1000 వర్డ్స్’. విల్లర్ట్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌లో రూపొందిన ఈ చిత్రానికి రమణ విల్లర్ట్ దర్శక నిర్మాతగా వ్యవహరించారు.  కే రవి కృష్ణారెడ్డి కో- ప్రొడ్యూసర్‌గా పని చేశారు. తాజాగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రం స్పెషల్ ప్రీమియర్‌కు రేణూ దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ ముఖ్య అతిథులుగా వచ్చారు.

ఈ సందర్భంగా రేణూ దేశాయ్ మాట్లాడుతూ.. “రమణ గారు ఫోటోగ్రాఫర్‌గా నాకు తెలుసు. ఆయన ఓ కథ చెప్పాడు. బాగానే అనిపిం చింది. కానీ ఎలా తీసి ఉంటారా? అని అనుకున్నాను. ఈ మూవీ చూశాక అద్భుతంగా అనిపించింది. సినిమా క్లుమైక్స్ చూశాక నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి” అన్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. “1000 వర్డ్స్’ అద్భుతమైన చిత్రం. అందరితో కంటతడి పెట్టించారు.

ఈ చిత్రానికి కచ్చితంగా అవార్డులు వస్తాయి. చాలా రోజులకు ఓ చక్కటి సినిమాను చూశానని అనిపిస్తుంది” అన్నారు. హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. ‘ఈ ప్రాజెక్టులో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. సూపర్ హీరో ఏ మాస్టర్ పీస్ సినిమా షూటింగ్‌లో నాకు గాయమైంది. దాదాపు ఎనిమిది బెడ్డు మీదే ఉండిపోయాను. ఆ టైమ్‌లోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది. ఆ దేవుడే రమణ గారిని నా దగ్గరకు పంపాడనిపిస్తోంది’ అన్నారు.

రమణ విల్లర్ట్ మాట్లాడుతూ.. ‘20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమాను చేయాలని తపిస్తున్నా. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. పురిటి నొప్పుల్ని డబ్బింగ్‌లో చూపించడంతో కన్నీళ్లు వచ్చాయి’ అని అన్నారు. దివి మాట్లాడుతూ.. ‘సినిమా చివర్లో ఏడ్చాను. చివరి పది నిమిషాలు హృదయాన్ని హత్తుకుంది. కథ విన్నప్పుడు ఇంత ఎఫెక్టివ్‌గా ఉంటుందని అనుకోలేదు. తెరపై అలా చూస్తూ మాతృత్వాన్ని ఫీల్ అయ్యాను’ అని అన్నారు.