calender_icon.png 20 November, 2024 | 1:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాత్రూంలో ఏడ్చాను

20-11-2024 12:23:54 AM

లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఒక్క ఓటమికే కుంగిపోతే జీవితం ముందుకు సాగదు. ఈ విషయాన్ని ఉదాహరణతో షారుఖ్ ఖాన్ వివరించారు. ఒక నటుడు స్టార్ స్టేటస్‌ను పొందాలంటే సాధారణ విషయం కాదు. ఎంతో శ్రమించాలి. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొవాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఇదే విషయాన్ని షారుఖ్ తనదైన శైలిలో వివరించారు.

షారుఖ్ ఖాన్ దుబాయ్‌లో జరిగిన గ్లోబల్ ఫ్రైట్ సమ్మిట్‌కి మంగళవారం హాజరయ్యారు. ఈ సమ్మిట్‌లో ఆయన ఫెయిల్యూర్స్ గురించి ప్రతి ఒక్కరికీ ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. ఫెయిల్యూర్ ఎదురైనప్పుడు బాధపడవద్దని, ఆత్మ పరిశీలన చేసుకోవాలని షారుఖ్ సూచించారు. సినీ పరిశ్రమను ఉదాహరణగా తీసుకుని దీనిని ఆయన వివరించారు.

ఒక సినిమా సరిగా ఆడలేదంటే అది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొనలేదని అర్థం చేసుకోవాలన్నారు. “మీరెప్పుడైనా ఫెయిల్ అయితే అది మీ వల్లనో.. మీరు చేసే ఉద్యోగం వల్లనో జరిగిందని భావించవద్దు. ప్రజలు ఎలా స్పందిస్తున్నారనేది మీరు అర్థం చేసుకోవాలి. నా సినిమా జనాల అభిమానాన్ని చూరగొనలేదంటే అది ఎంత అద్భుతంగా ఉన్నా అనవసరం.

తొలినాళ్లలో నా సినిమా ఫెయిల్ అయినప్పుడు నేను బాత్రూంలో ఏడ్చాను. సినిమా ఫెయిల్యూర్ కారణంగా ప్రపంచమంతా మనకు వ్యతిరేకమని భావించకూడదు. నీ సినిమా సరిగా ఆడలేదంటే అది నీ కారణంగానో లేదంటే ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా కుట్ర చేసినందువల్లనో కాదు. సరిగా నటించలేదని అర్థం చేసుకోవాలి. తదుపరి చిత్రం కోసం ఎఫర్ట్ పెట్టాలి” అని షారుఖ్ అన్నారు. ఆయన ప్రస్తుతం ‘కింగ్’ అనే చిత్రంలో నటిస్తున్నారు.